AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇదెక్కడి విడ్డూరం.. ఇద్దరి భామల ముద్దుల మొగుడు.. ఇద్దరికి మూడేసి ముళ్లు

ఆడు మగాడ్రా బుజ్జి.. ఇక్కడ ఫోటోలో చూస్తున్న వ్యక్తి.. ఇద్దరు భామలను ఒకేసారి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరి భామల ముద్దుల మొగుడుగా మారాడు. ఈ ఘటన తెలంగాణలోని ఆసిఫాబాద్‌లో జరిగింది. ఆ స్టోరీ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందామా..

Telangana: ఇదెక్కడి విడ్డూరం.. ఇద్దరి భామల ముద్దుల మొగుడు.. ఇద్దరికి మూడేసి ముళ్లు
Trending
Naresh Gollana
| Edited By: |

Updated on: Mar 28, 2025 | 1:51 PM

Share

ఒకే పెళ్లి మండపంలో ఒకేసారి ఇద్దరు అమ్మాయిల మెడలో తాళి కట్టి వార్తల్లోకెక్కాడు ఓ యువకుడు. అంతేకాదు, శుభలేఖలోనూ ఆ ఇద్దరు యువతులను పెళ్లి చేసుకుంటున్నట్లు ఒకే కార్డ్ పై ముద్రించి బందువుల భారీగా ఆహ్వానించాడు. వేయి మంది అతిథుల సాక్షిగా ఆ ఇద్దరి యువతుల మెడలో మూడు ముళ్లు.. స్వారీ ఆరు ముళ్లేసి ఇద్దరు భార్యల ముద్దుల మొగుడిగా మారాడు. ఈ విచిత్ర ఘటన కొమురంభీం ఆసిపాబాద్ జిల్లా లింగపూర్ మండలం గుమ్నూర్‌లో ఈ పెళ్లి తంతు‌ జరిగింది. ఆ నోట ఈ నోట సోషల్ మీడియాలోకి ఎక్కడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ ముగ్గురి జంట పెళ్లి.

ఇది చదవండి: దేవుడు కలలో కనిపించి పొలంలో తవ్వమన్నాడు.. తీరా తవ్వి చూడగా

ఆ ఇద్దరు‌ యువతులను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ యువకుడు ఏ కోటీశ్వరుడో, లక్షాధికారి కొడుకో కాదు.. ఓ సాధారణ రైతు. మూడేళ్ల కిందట చిగురించిన ప్రేమ ఇదిగో ఇలా ఆరు ముళ్లతో ముగ్గురిని ఒక్కటి చేసింది. అలా అని ఆ ఇద్దరు యువతులు అక్కా చెల్లెల్లో.. స్నేహితులో కాదు.. ఇద్దరు వేరు వేరు గ్రామాలకు చెందిన యువతులు. ఆ ఇద్దరి యువతుల ఆలోచన విధానం కూడా వేరే.. అయినా ఆ ఇద్దరిని ఒప్పించి ఆ ఇరువురు యువతుల కుటుంబాలను మెప్పించి ఈ ప్రేమ పెళ్లి చేసుకున్నాడు యువకుడు సూర్యదేవ్.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని గుమ్నూర్ కు చెందిన సూర్యదేవ్ అనే యువకుడు లాల్దేవి, జలకర్ దేవి అనే ఇద్దరు యువతులను ప్రేమించాడు. ప్రేమించిన ఆ ఇద్దరి యువతులను పెళ్లి చేసుకుంటానంటూ ఒప్పించాడు. ఒప్పించడమే కాదు.. ఒకే పెళ్లి మండపంలో ఒకే ముహుర్తానికి వేయి మంది అతిథుల సమక్షంలో ఇద్దరి‌ మెడలో మూడు ముళ్లు వేసి ఇద్దరి భామల ముద్దుల మొగుడిగా మారాడు. ఒక్క అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే గగనంగా మారిన ఈ రోజుల్లో ఇద్దర్ని ప్రేమించి ఒకే పెళ్లి మండపంలో ఒకే సమయంలో మనువడం సూపర్ అంటున్నారు ఈ పెండ్లి వేడుక చూసిన అతిథులు. అంతే కాదు ఈ ఇద్దరికీ భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు కూడా రాకుండా చూసుకుంటానని ఓ బాండ్ పేపర్ రాసి ఇవ్వడం మరింత చర్చనీయాంశం అయింది. ఇద్దరు‌అమ్మాయిల తల్లిదండ్రులు ఆ ఒప్పందానికి ఒకే చెప్పడంతో ఇదిగో ఇలా ముగ్గురు వివాహ బంధంతో ఇలా ఒకటయ్యారు.

ఇది చదవండి: కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు.. ఆపి చెక్ చేయగా