సెక్రటేరియేట్ నుంచి మాట్లాడుతున్నా.. సస్పెండైనవారి లిస్ట్ కావాలి.. అగంతుకుడి బ్లాక్ మెయిల్ కాల్..
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లోని కీలక అధికారి ఇటీవల 96520 72319 అనే నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీ జిల్లాలో వివిధ కారణాలతో సస్పెండైన...
చాలా సార్లు ఈజీగా మోసపోయేది.. బుట్టలో పడేది ఎవరంటే.. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులే అని చాలా నిరూపించపడింది. అచ్చు అలానే మరోసారి మోసపోయారు ఉన్నతాధికారులు. ఇలానే, టోకరా వేశాడో అగంతకుడు… దీనితో తెలంగాణా జిల్లా రంగారెడ్డి అధికారులు తెల్లముఖం వేశారు. తమ వద్ద అధికారికంగా లిస్ట్ తీసుకుని, తీరికగా ఆ ఆగంతకుడు ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేశాడని గ్రహించారు. తాజాగా సెక్రటేరియేట్ నుంచి మాట్లాడుతున్నానంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో పనిచేసే కీలక ఉన్నతాధికారికి టోకరా వేశారు. మరికొందర్ని నిండా ముంచేందుకు ప్రయత్నించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఉన్నతాధికారి ఫిర్యాదుతో సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లోని కీలక అధికారి ఇటీవల 96520 72319 అనే నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీ జిల్లాలో వివిధ కారణాలతో సస్పెండైన వీఆర్వోలు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది ఎంత మంది ఉంటారు..? అని ప్రశ్నించాడు. సస్పెండైన ఉద్యోగుల పేర్లు, హోదాలు, ఫోన్ నంబర్లు అత్యవసరంగా కావాలంటూ తొందర పెట్టాడు. ఎందుకంటే.. సచివాలయంలో పనిచేసే మరో ఉన్నతాధికారి పేరు చెప్పాడు. కార్యాలయానికి పంపిస్తే ఆలస్యమవుతుందని.. వెంటనే వాట్సాప్‌లో పంపించాలని కోరాడు. ఆ ఉన్నతాధికారి సిబ్బందిని పురమాయించి ఆగమేఘాలపై జాబితాను వాట్సాప్‌లో పంపించారు. అంతే, ఆగమేఘాల మీద రంగారెడ్డి కలెక్టరేట్ నుండి డేటాను మొత్తం ఆగంతకుడికి పంపేశారు.
వాడి మోసానికి ఇక్కడ తెరలేపాడు.. ఆ లిస్ట్ లో ఉన్న ఒక్కో సస్పెండ్ అయిన ఉద్యోగికి ఆగంతుకుడు ఫోన్ కాల్స్ చేశాడు. మీకు మళ్ళీ ఉద్యోగం కావాలంటే.. తనకు కొంత చెల్లించాలని డిమాండు చేశాడు. సస్పెన్షన్ ఎత్తివేయడమే కాకుండా, ప్రమోషన్ కూడా ఇప్పిస్తానని చెప్పడంతో అగంతకుడి మాటలు నమ్మేశారు. తాము పర్సనల్ గా కలిసి డబ్బు ఇస్తామని, తమ బాధలు చెప్పుకుంటామని పలువురు ఉద్యోగులు ఆ ఆగంతుకుడిని బతిమిలాడుకున్నారు. కానీ, కరోనా వ్యాప్తి కారణంగా కలవలేనని, గూగుల్ పే, ఫోన్ పే చేయాలని తొందరపెట్టాడు ఆ ఆగంతకుడు. దీంతో కొంత మంది ఉద్యోగులు వెంటది వెంటనే డబ్బులు పోస్ట్ చేశారు
అయితే ఇక్కడే కొందరు ఉద్యోగులకు అనుమానం వచ్చింది. ఇప్పటికే సస్పెండై చిక్కుల్లో ఉన్న కొందరు అనుమానంతో రంగారెడ్డి కలెక్టరేట్‌లో ఆరా తీశారు. సస్పెండ్ అయిన ఉద్యోగుల డేటా మొత్తం రంగారెడ్డి కలెక్టరేట్ నుండి వెళ్లిందని ఆ అధికారి అసలు కథ చెప్పడంతో ఇదంతా ఎవడో బ్లాక్ మెయిలర్ పని అని అర్ధం అయింది. తమకు ఫోన్ చేసిన వ్యక్తి ఆచూకి కోసం సచివాలయంలో ఎంక్వయిరీ చేస్తే, అటువంటి వ్యక్తి ఎవరూ లేకపోవడంతో మోసపోయామని తెలుసుకున్నారు. చివరికి సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు.
ఇవి కూడా చదవండి: వీరిది సహాపంక్తి భోజనం.. తినడానికి పొంగలి.. రుచికరమైన వంటకాలు.. కానీ ప్లేట్లు.. విస్తరాకుల్లో కాదు.. మరీ ఎలా తింటారో తెలుసా..
Acharya Chanakya: నీరు.. డబ్బు.. ఒకటే.. సంపాదించిన సంపదను ఏం చేయాలో చెప్పిన చాణక్యుడు..