Doctor Missing: నల్గొండలో NRI డాక్టర్ అదృశ్యం.. కిడ్నాపా.. ఆత్మహత్యా.. హత్యా.. లేదంటే..
అతను.. ఫ్యామిలీతో చాలా సరదాగా గడిపాడు. ఆ తర్వాత.. మేలదుప్పలపల్లిలోని తన ఫామ్‌హౌస్‌కి వెళ్లాడు. ఆ తర్వాత ఏమైందన్నదే మిస్టరీ
అమెరికా వెళ్లాల్సిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఫ్లైట్‌లో టేకాఫ్ అవ్వాల్సిన వ్యక్తి సైలెంట్ అయిపోయాడు. ఇంతకీ అతను ఉన్నాడా.. లేడా ! ఉంటే ఎక్కడున్నాడు. లేకపోతే ఏమైపోయాడు. ఈ ప్రశ్నల మధ్య ఓ అనుమానం ఏంటంటే.. అతను చనిపోయాడేమోనని. ! అందుకే ఓ బావిలోనూ నీటిని తోడి గాలిస్తున్నారు.. డాక్టర్ పేరు జయశీల్ రెడ్డి. నల్గొండ జిల్లా మేలదుప్పలపల్లి కేరాఫ్. NRI డాక్టర్ జయశీల్ బుధవారం సాయంత్రం అమెరికాకు వెళ్లాల్సి ఉంది. అందుకు సిద్ధంగా ఉన్న అతను.. ఫ్యామిలీతో చాలా సరదాగా గడిపాడు. ఆ తర్వాత.. మేలదుప్పలపల్లిలోని తన ఫామ్‌హౌస్‌కి వెళ్లాడు. ఆ తర్వాత ఏమైందన్నదే మిస్టరీ
ఫామ్‌హౌస్‌కి వెళ్లిన జయశీల్.. సింగిల్‌గా సెల్ఫీలు, వీడియోలు తీసుకుని కుటుంబసభ్యులకు, స్నేహితులకు పంపాడు. ఆ తర్వాత అతను ఇంటికి వెళ్లలేదు. ఫోన్ చెయ్యలేదు. కుటుంబసభ్యులు కాల్ చేస్తే స్విచ్ఛాప్. ఫామ్‌హౌస్‌లోనూ లేడు. ఏమైపోయాడన్న టెన్షన్. పంపిన సెల్ఫీలు, వీడియోల తీరు చూస్తే.. అనుమానం వచ్చింది. ఆమేరకు పోలీసులకూ ఫిర్యాదు చేశారు. వాళ్లు కూడా గాలించి అనుమానం కొద్దీ ఫామ్‌హౌస్‌లోనే బావిలో వెతకడం ప్రారంభించారు. బావిలోని నీటిని తోడుతున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో చెప్పాల్సిన మరో విషయం జయశీల్ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి దగ్గరి బంధువు. ఇంతకీ జయశీల్ చనిపోయాడా.. ! చంపేశారా! చనిపోయేంత కష్టం ఏముంది? ఒకవేళ చంపేస్తే… అంత పగ ఏముంది? ఇవేవీ కాదు.. కిడ్నాప్ లాంటిది జరిగిందా. ఒకవేళ ఉండి ఉంటే, రేపు ఫ్లైట్ పెట్టుకుని ఏమైపోయాడు. ఇవన్నీ జయశీల్ అదృశ్యం వ్యవహారంలో తేలాల్సిన ప్రశ్నలు.
ఇవి కూడా చదవండి: వీరిది సహాపంక్తి భోజనం.. తినడానికి పొంగలి.. రుచికరమైన వంటకాలు.. కానీ ప్లేట్లు.. విస్తరాకుల్లో కాదు.. మరీ ఎలా తింటారో తెలుసా..
Acharya Chanakya: నీరు.. డబ్బు.. ఒకటే.. సంపాదించిన సంపదను ఏం చేయాలో చెప్పిన చాణక్యుడు..