KTR on Rains: సిరిసిల్లాలోని వర్షాలు, వరదలపై కేటీఆర్ సమీక్ష.. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు

Surya Kala

Surya Kala |

Updated on: Sep 07, 2021 | 12:41 PM

KTR on Rains: రాజన్న సిరిసిల్లా తాజా పరిస్థితి,   వర్షాలు , వరద ఉధృతి పై మంత్రి కేటీఆర్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ లతో టెలీ కాన్ఫిరెన్స్ నిర్వహించారు.  లోతట్టు ప్రాంతాలోని ప్రజలను..

KTR on Rains: సిరిసిల్లాలోని వర్షాలు, వరదలపై కేటీఆర్ సమీక్ష.. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు
Ktr On Rains

KTR on Rains: రాజన్న సిరిసిల్లా తాజా పరిస్థితి,   వర్షాలు , వరద ఉధృతి పై మంత్రి కేటీఆర్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ లతో టెలీ కాన్ఫిరెన్స్ నిర్వహించారు.  లోతట్టు ప్రాంతాలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. ప్రజల పునరావాస కేంద్రాలను ఏర్పాటును పర్యవేక్షించాలని తెలిపారు. వరద ప్రభావిత కాలనీలకు హైదరాబాద్ నుంచి డీఆర్ఎఫ్ బృందం తరలించనున్నారు. ఇక పట్టణంలోని వరద నీరు మల్లింపుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు కేటీఆర్ సూచించారు.

గత మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో సిరిసిల్ల పట్టణంలో వరద గుప్పిట్లో చిక్కుకుంది. పలు కాలనీలోకి వరద నీరు వచ్చి   చేరుతున్న దృష్ట్యా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా యంత్రాగాన్ని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సోమవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి వరద ఉదృతి పెరగడంతో కాలనీలకు భారీగా వరద నీరు వచ్చిన విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి చేరుకుంది. దీంతో తక్షణం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలనీ జిల్లా కలెక్టర్ ను,  అధికారులను ఆదేశించారు. రానున్న 48 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ..  వరద మల్లింపుకు అన్ని చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దని, అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రంగం సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Also Read:  తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష.. సహాయ, పునరావాస చర్యపై అధికారులకు ఆదేశాలు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu