Congress Party: కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రేటర్ అమాత్యులెవరు..? హైదరాబాద్ ను రిప్రజెంట్ చేసేది ఆయనేనా..!
తెలంగాణ మఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్న వేళ మిగతా మంత్రివర్గ కూర్పుపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. జిల్లాల వారీగా ఎవరెవరికి ఆమాత్య యోగం ఉందో అని స్థానిక నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. కానీ గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది. జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో ఇప్పడు బల్దియాను రిప్రజెంట్ చేసే మంత్రి ఎవరా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ మఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్న వేళ మిగతా మంత్రివర్గ కూర్పుపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. జిల్లాల వారీగా ఎవరెవరికి అమాత్య యోగం ఉందో అని స్థానిక నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. కానీ గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది. జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో ఇప్పడు బల్దియాను రిప్రజెంట్ చేసే మంత్రి ఎవరా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసింది. ముఖ్యమంత్రిగా ఆయనతో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి మినహా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. దీంతో ఆయా జిల్లాల్లో కీలక నేతలకు అమాత్య పదవి ఖాయం అనే మాట వినిపిస్తోంది. కానీ బల్దియాలో మాత్రం మంత్రి ఎవరా అనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉంటే బీఆర్ఎస్ 7, ఎంఐఎం 7, బిజెపి ఒకటి గెలిచాయి. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో బల్దియా కొంత భాగం ఉన్నా మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. జీహెచ్ఎంసీ పరిధిలోకి 24 నియోజకవర్గాలు వస్తే అందులో 16 సీట్లు బీఆర్ఎస్ గెలిచింది. దీంతో జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం లేకుండా పోయింది.
బల్దియా పరిధిలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేకపోవడంతో అర్బన్ ఓటర్లు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినట్లు అర్ధం అవుతోంది. ఇప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను రిప్రజెంట్ చేసే అమాత్యులు ఎవరా అని నగరవాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నరు. నగరంలోని ఏదైనా కాంగ్రెస్ నేతకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారా అంటే.. ఇప్పటికిప్పుడు అలాంటి పరిణామాలు కనిపించడం లేదు. నగరాన్ని ఆనుకుని ఉన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి మల్ రెడ్డి రంగారెడ్డి విజయకేతనం ఎగురవేశారు. దీంతో ఆయనకి మంత్రి పదవి అప్పగించి గ్రేటర్ అమాత్యునిగా చూస్తారా అనే అనుమానాలు వ్యక్తంమవుతున్నాయి. బల్దియాను రిప్రజెంట్ చేసే మంత్రిగా మల్‌రెడ్డి రంగారెడ్డి కి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
గ్రేటర్ పరిధిలోని కాంగ్రెస్ కీలక నేత ఎవరికైనా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. నగరంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో ఎవరో ఒకరు కాంగ్రెస్ లో చేరి మంత్రి అవుతారని ప్రచారం జరుగుతున్నా.. అది ఇప్పట్లో అయ్యే పనిలా లేదు. పార్టీ కోసం కష్టపడిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలన్న కాంగ్రెస్ కు మంత్రివర్గ కూర్పు కూడా పెద్ద సవాలుగా కనిపిస్తోంది. దానికి తోడు ఐటీ ఉద్యోగులు, యువత అంతా కొత్త ఐటీ మినిస్టర్ ఎవరా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఈ రెండు అంశాలపై ఎంతో ఆసక్తి నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..