AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: సీఎం ప్రమాణ స్వీకారానికి ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు.. రేపు హైదరాబాద్‌కు సోనియా గాంధీ..!

నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఎల్బి స్టేడియం ముస్తాబవుతోంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తున్నారు అధికారులు. ఈ ఏర్పాట్లను రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి, రాష్ట్ర డిజిపి రవి గుప్తా, సిపి సందీప్ శాండిల్యాతో సహా పలువురు ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంట నాలుగు నిమిషాల ప్రాంతంలో ఎల్బీ స్టేడియంలో నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు.

Revanth Reddy: సీఎం ప్రమాణ స్వీకారానికి ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు.. రేపు హైదరాబాద్‌కు సోనియా గాంధీ..!
Revanth Reddy Sinia Gandhi
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Dec 06, 2023 | 3:39 PM

Share

నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఎల్బి స్టేడియం ముస్తాబవుతోంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తున్నారు అధికారులు. ఈ ఏర్పాట్లను రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి, రాష్ట్ర డిజిపి రవి గుప్తా, సిపి సందీప్ శాండిల్యాతో సహా పలువురు ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంట నాలుగు నిమిషాల ప్రాంతంలో ఎల్బీ స్టేడియంలో నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత కృతజ్ఞత సభ కూడా ఉండడంతో భారీ ఎత్తున భద్రత ఏర్పాట్లను చేస్తున్నారు అధికారులు.. నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక తో సహా పలువురు కాంగ్రెస్ పెద్దలు హాజరుకానుండటంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో ఎల్పీ స్టేడియానికి వచ్చే అవకాశం ఉన్నందున వారు వచ్చేటటువంటి రూట్ మ్యాప్ ను సైతం సిద్ధం చేస్తున్నారు.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్టు సంతకాలతో కూడిన లేఖ ను గవర్నర్ కు అందజేశారు కాంగ్రెస్ బృందం. ఇక రేపు మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఏల్బీ స్టేడియంలో ప్రమాణం స్వీకారం చేయనున్నారని అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని గవర్నర్ ను కోరారు కాంగ్రెస్ నాయకులు.. అందుకుగాను ఎల్బీనగర్ లో కూడా శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. వీఐపీలు, వీవీఐపీలు గేట్ 8 నెంబర్ నుంచి వచ్చే విధంగా, గేట్ నెంబర్ 6 నుండి పబ్లిక్ వచ్చే విధంగా ఓ మ్యాప్ ని కూడా సిద్ధం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ పెద్దలే కాకుండా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం వస్తున్నారని సమాచారం. దీంతో ఎల్బీ స్టేడియాన్ని తమ ఆధీనంలోనికి తీసుకున్నారు పోలీసులు. స్టేడియం లోపల ప్రతి ఒక్క ప్రదేశాన్ని డాగ్ స్క్యాడ్ తో సహా బాంబ్ స్క్యార్డ్ తనిఖీలను చేపట్టారు. జిహెచ్ఎంసి కమిషనర్ ఏర్పాట్లను పరిశీలించారు.

రేపు మధ్యాహ్నం జరగబోయేటటువంటి ఈ ప్రమాణస్వీకారానికి సంబంధించి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలును విధించనున్నారు. ఎల్బీ స్టేడియం వైపు వెళ్లేటటువంటి మార్గాలను వెళ్లకుండా చర్యలు తీసుకోనున్నారు. దీనికోసం ప్రత్యేక మార్గాల్లో మవెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ఈ విధంగా నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు
త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఎక్కడినుంచి ఎక్కడివరకు అంటే
త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఎక్కడినుంచి ఎక్కడివరకు అంటే
RCB Full Squad: స్వ్కాడ్‌తోనే ప్రత్యర్థులకు తలనొప్పి షురూ..
RCB Full Squad: స్వ్కాడ్‌తోనే ప్రత్యర్థులకు తలనొప్పి షురూ..