Chandrababu: హైదరాబాద్‌లో చంద్రబాబుతో పవన్ భేటి.. చర్చించిన అంశాలు ఇవే..
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుతో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలిశారు. ప్రస్తుత ఏపీ రాజకీయాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఈయనతో పాటూ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొనడం కాస్త ఆసక్తి రేపుతోంది. టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై నవంబర్ 4న వీరిద్దరూ సమావేశమయ్యారు.

తరచూ సమావేశమై పొత్తు ప్రక్రియ వేగవంతం చేయాలని నిర్ణయించుకున్నారు. దానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని గతంలో ఇరువురు నేతలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం మరోసారి చంద్రబాబు, పవన్ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాములో అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకు వచ్చిన తరువాత ఇలా వరుస భేటీలు జరగడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. దాదాపు గంటపాటూ ఇరువురి మధ్య చర్చలు జరిగింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..