AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: గురువారం మహాధర్నాలో పాల్గొంటున్న సీఎం కేసీఆర్‌.. ధాన్యం కొనుగోలుపై ప్రధాని మోడీకి లెటర్‌..

వరి మంటలు చల్లారడం లేదు. ధాన్యం కొనుగోలుపై రాజుకున్న వివాదం కంటిన్యూ అవుతోంది. ఈ సమస్య పరిష్కారం కోసం TRS కేంద్రంతో తాడో-పేడో తేల్చుకునేందుకు రెడీ అయింది.

CM KCR: గురువారం మహాధర్నాలో పాల్గొంటున్న సీఎం కేసీఆర్‌.. ధాన్యం కొనుగోలుపై ప్రధాని మోడీకి లెటర్‌..
Maha Dharna
Sanjay Kasula
|

Updated on: Nov 17, 2021 | 10:06 PM

Share

Maha dharna: వరి మంటలు చల్లారడం లేదు. ధాన్యం కొనుగోలుపై రాజుకున్న వివాదం కంటిన్యూ అవుతోంది. ఈ సమస్య పరిష్కారం కోసం TRS కేంద్రంతో తాడో-పేడో తేల్చుకునేందుకు రెడీ అయింది. తెలంగాణ ప్రభుత్వ..కేంద్రానికి మధ్య ధాన్యం కొనుగోల్ల విషయంలో రాజుకున్న అగ్గి రాజకీయ రణరంగాన్ని సృష్టిస్తోంది. రైతుల దగ్గరున్న ధాన్యం కొనుగోలు చేసే విషయంలో బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరికించి రైతుల దగ్గర రాజకీయం చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈవిషయంపైనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేంద్రం వైఖరిని నిరసిస్తూ మహాధర్నాకు పిలుపునిచ్చింది.

గురువారం హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌ దగ్గర నిరసనలకు పిలుపునిచ్చారు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్. ఈ ధర్నాలో సీఎం కేసీఆర్‌తో పాటు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అంతా పాల్గొంటారు. అటు నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో గులాబీనేతలు ఆందోళనలకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ధాన్యం పండించిన రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రధాని మోదీకి లేఖ రాశారు సీఎం కేసీఆర్. ధాన్యం కొనుగోలుపై FCIకి ఆదేశాలివ్వాల‌ని లేఖ‌లో పేర్కొన్నారు. 2020-21 ర‌బీలో మిగిలిన 5 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొనుగోలు చేయాల‌ని విజ్ఞప్తి చేశారు. పంజాబ్ త‌ర‌హాలో తెలంగాణ‌లో కూడా ధాన్యం సేక‌ర‌ణ చేప‌ట్టాల‌ని సూచించారు. ఏటా ఉత్పత్తి పెరుగుతున్నా సేక‌రించే మొత్తం పెర‌గ‌ట్లేదని లేఖలో ప్రస్తావించారు.

టీఆర్‌ఎస్‌ నేతలకు కౌంటరిచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కౌంటర్ ఇచ్చారు. వ్యవసాయ చట్టాలకు నాడు మద్దతు తెలిపిన సీఎం కేసీఆర్‌ ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నారని విమర్శించారు. మొత్తంగా అటు టీఆర్‌ఎస్‌ ఇటు బీజేపీ మధ్య మాటల వేడి తగ్గడం లేదు. వరి కేంద్రంగా ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి: Air pollution: ఉద్యోగులు ప్రజా రవాణాను వినియోగించండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు..

PM Narendra Modi: ఈనెల 19న యూపీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఎందుకోసమంటే..