Khammam: RMP డాక్టర్ పంట పండింది.. వేసింది ఒకే ఒక్క టెండర్.. షాప్ వచ్చింది..
ఎంతమంది టెండర్లు వేసినా ఒక్కరికేగా ఆ అదృష్టం దక్కేది. కొందరు అయితే సిండికేట్‌గా ఏర్పడి చాలా షాపులకు వేసినప్పటికీ రెండు మూడు చోట్ల మాత్రమే షాపులు దక్కాయి. కానీ ఇతనికి పంట పండింది. వేసింది ఒక్క అప్లికేషన్ మాత్రమే. కానీ లక్కీ డ్రాలో షాపు దక్కింది...

తెలంగాణలో లిక్కర్ షాపుల కేటాయింపు ప్రక్రియ పూర్తైంది. సోమవారం కలెక్టర్లు లక్కీ డ్రా ద్వారా షాపుల కేటాయింపు చేశారు. 2,620 షాపులకు మొత్తం 95,137 అప్లికేషన్స్ వచ్చాయి. అయితే.. 19 షాపులకు సింగిల్ డిజిట్ అప్లికేషన్స్ రావడంతో.. మంగళవారం మరోమారు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ 19 షాపులకు నవంబరు 3న డ్రా తీయనున్నారు. షాపు దక్కినవారు నవంబరు 2025 నుంచి అక్టోబరు 2027 వరకూ మద్యం అమ్మకాలు జరుపుకోవచ్చు. అయితే.. లక్కీ డ్రాలో కొందరికి లక్ కలిసివస్తే.. మరికొందర్ని దురదృష్టం వెంటాడింది.
Also Read: ఒకే ఒక్క టెండర్ వేశాడు.. చనిపోయిన తర్వాత లక్కీడ్రాలో పేరు.. షాపు ఎవరికి..?
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ RMP ఖమ్మంలో టెండర్ వేయగా.. అతని పంట పండింది. మూడు లక్షలు పెట్టి.. కేవలం ఒకే ఒక్క అప్లికేషన్ వేస్తే.. లక్కీ డ్రాలో షాపు తగిలింది. ఇంతకంటే అదృష్టం ఉంటుందా చెప్పండి. చెప్పలేనంత ఆనందంగా ఉందని.. తనను దేవుడు కరుణించాడని మురిసిపోతున్నాడు ఆ RMP. షాపు అతనికి కేటాయింపు చేస్తూ జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారిక లెటర్ అందజేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా రెండు, మూడు చోట్ల మాత్రమే ఒక్క అప్లికేషన్ వేసినవారికి షాపులు దక్కాయి. కరీంనగర్‌లో కూడా ఓ వ్యక్తి ఒక్క అప్లికేషన్ వేస్తే.. 34 దరఖాస్తుల్లో అతని పేరే రావడంతో.. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
