AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గంజాయి మత్తులో బాటసారులను పరుగులు పెట్టించిన ఆకతాయికి దేహశుద్ధి!

జనగామ జిల్లా కేంద్రంలో ఓ ఆకతాయి రెచ్చిపోయాడు. గంజాయి మత్తులో వీరంగం సృష్టించాడు. కత్తి చేతిలో పట్టుకుని ఊరంతా హల్ చల్ చేశాడు. అతనికి ఎదురుపడ్డ వారిని ఆపి కత్తితో పైశాచికంగా దాడికి పాల్పడ్డాడు. మత్తులో మానసిక రోగిలా ప్రవర్తించిన ఆ ఆకతాయికి స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. కట్టేసి పోలీసులకు అప్పగించారు.

గంజాయి మత్తులో బాటసారులను పరుగులు పెట్టించిన ఆకతాయికి దేహశుద్ధి!
Psycho Terrorizes
Balaraju Goud
|

Updated on: Oct 28, 2025 | 9:37 PM

Share

జనగామ జిల్లా కేంద్రంలో ఓ ఆకతాయి రెచ్చిపోయాడు. గంజాయి మత్తులో వీరంగం సృష్టించాడు. కత్తి చేతిలో పట్టుకుని ఊరంతా హల్ చల్ చేశాడు. అతనికి ఎదురుపడ్డ వారిని ఆపి కత్తితో పైశాచికంగా దాడికి పాల్పడ్డాడు. మత్తులో మానసిక రోగిలా ప్రవర్తించిన ఆ ఆకతాయికి స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. కట్టేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలోని అమ్మనబావి కాలనీలో జరిగింది. ఓ యువకుడు మత్తులో పట్టపగలే రెచ్చిపోయాడు. కత్తి చేతిలో పట్టుకుని ఊరంతా పరుగులు పెట్టించాడు. అతని ఎవరు ఎదురొచ్చినా ఆపి కత్తితో దాడికి పాల్పడ్డాడు.

ఆ ఆకతాయి కత్తితో బీభత్సం సృష్టించడంతో కాలనీ ప్రజలంతా హడలెత్తిపోయారు. ఈ క్రమంలో కొందరు స్థానికులు సాహసం చేసి అతన్ని పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి ఒళ్ళంతా కుళ్ళ పొడిచారు. అతని చేతిలోని కత్తి లాక్కొని కట్టేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. దాడికి పాల్పడ్డ ఆ యువకుడు ఎవరూ..! అనేది గుర్తించలేదు. గంజాయి మత్తులో వీరంగం సృష్టించాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పోకిరీలపై కఠినచర్యలు తీసుకుని సామాన్య ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

వీడియో చూడండి.. 

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us