Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు, రేపు భారీ వర్షాలు.. వాతావరణశాఖ అలెర్ట్
Telangana Weather Alert: దేశంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మరి కొన్ని
Telangana Weather Alert: దేశంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మరి కొన్ని రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో ఆదివారం బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల వద్ద అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న వెల్లడించారు. ఇప్పటికే ఆ ప్రాంతాల్లో గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ద్రోణి ఏర్పడిందన్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని.. వీటి ప్రభావంతో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీవర్షాలు పడవచ్చని తెలిపారు. దీంతో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అక్కడక్కడ చెదురుమొదురు వర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశముందని వాతవరణ కేంద్రం వెల్లడించింది.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం అర్థరాత్రి నుంచి ఏపీలోని విశాఖపట్నం, గోదావరి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు వారంపాటు కుండపోత వర్షాలు కురిసే అవకాశముందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే.
Also Read: