AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bonalu: నేటి నుంచి ఆషాఢమాసం బోనాలు ప్రారంభం.. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్..

Bonalu: తెలంగాణలో నేటి నుంచి ఆషాఢమాసం బోనాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం...

Bonalu: నేటి నుంచి ఆషాఢమాసం బోనాలు ప్రారంభం.. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్..
Bonalu
Shiva Prajapati
|

Updated on: Jul 11, 2021 | 9:51 AM

Share

Bonalu: తెలంగాణలో నేటి నుంచి ఆషాఢమాసం బోనాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. ఇప్పటికే బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావించిన దరిమిలా.. అధికారులు సైతం ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా లంగర్‌హౌస్‌ నుంచి తొట్టెల ఊరేగింపు జరగనుంది. బగ్గీపై ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ సమర్పిస్తారు. అమ్మవారికి పట్టువస్త్రాలను మంత్రులు ఇంద్రకరణ్‌, తలసాని శ్రీనివాస్‌ సమర్పించనున్నారు. కాగా, ఇవాళ్టి నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాలు జరుగనున్నాయి. ప్రతి గురువారం, ఆదివారం అమ్మవార్లకు భక్తులు బోనాలు సమర్పిస్తారు.

ఇదిలాఉంటే.. బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. బోనాల ఉత్సవాలు తెలంగాణ సబ్బండ వర్ణాల గంగా జమునా తెహజీబ్ కు ప్రతీక గా నిలుస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అమ్మవారి దీవెనతో, ప్రభుత్వ పట్టుదలతో.. తెలంగాణ రాష్ట్రం దేశానికే భోజనం పెట్టే అన్నపూర్ణగా మారిందన్నారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.

విజయవాడ దుర్గమ్మకు ఆషాఢ సారె.. మరోవైపు ఆషాడ మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌‌లోని విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో ఆషాఢ సారె ప్రారంభమైంది. దుర్గమ్మను తమ ఆడపడుచుగా భావించి భక్తులు అమ్మవారికి ఆషాడం సారెను సమర్పించనున్నారు. పూలు, పళ్లు, గాజులు, చీరతో పాటు చలిమిడితో కూడిన సారెను.. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి సారె సమర్పించనున్నారు. కాగా, ఆయలం తరఫున అమ్మవారికి మొదటి సారెను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమర్పించనున్నారు.

Also read:

‘మందు కొట్టిన గేదెలు’ఆ తరువాత ఏం చేశాయో చూడండి..!వైరల్ అవుతున్న వీడియో..:Drunk Buffaloes Viral Video.

మార్కెట్‌లోకి 200 మెగాపిక్సెల్‌ కెమెరా ఫోన్‌.? స్మార్ట్ ఫోన్ రంగంలో నూతన అధ్యయనం..:200 Megapixel Camera Video.

Nehru Zoological Park: నేటి నుంచి తెరుచుకోనున్న జూ పార్కులు.. సందర్శనకు వచ్చే వారి కోసం మార్గదర్శకాలు విడుదల

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..