AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాక్సిడెంట్ చేసి దుబాయ్ చెక్కేసిన మాజీ ఎమ్మెల్యే కొడుకు.. 16 మందిపై కేసు నమోదు

పంజాగుట్ట షకీల్ కొడుకు యాక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై పోలీసులు లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు. యాక్సిడెంట్ కేసులో తనకుమారుడిని తప్పించడానికి షకీల్ సహకరించాడని అభియోగాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. వీరుఇద్దరితో పాటు మరో నలుగురు విదేశాలకు పారిపోవటంతో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి.

యాక్సిడెంట్ చేసి దుబాయ్ చెక్కేసిన మాజీ ఎమ్మెల్యే కొడుకు.. 16 మందిపై కేసు నమోదు
Bmw Crash
Vijay Saatha
| Edited By: Rajeev Rayala|

Updated on: Feb 06, 2024 | 7:47 PM

Share

హైదరాబాద్ పంజాగుట్ట రోడ్డుప్రమాదం కేసు కీలక మలుపు తిరిగింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. రాహిల్‌తో కలిసి షకీల్‌ దుబాయ్ పారిపోయారని తెలిపారు. ఈ కేసులో పంజాగుట్ట, బోధన్‌ సీఐలను ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. నిందితుడికి పోలీసులు సహకరించినట్లు ఆధారాలున్నాయని.. ఈ కేసులో మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేశామని డీసీపీ తెలిపారు. ఇక పరారీలో ఉన్న ఏడుగురు నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు.

పంజాగుట్ట షకీల్ కొడుకు యాక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై పోలీసులు లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు. యాక్సిడెంట్ కేసులో తనకుమారుడిని తప్పించడానికి షకీల్ సహకరించాడని అభియోగాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. వీరుఇద్దరితో పాటు మరో నలుగురు విదేశాలకు పారిపోవటంతో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి.

హైదరాబాద్ పంజాగుట్ట ప్రజాభవన్ ముందు యాక్సిడెంట్ కేసులో A3 గా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పరారీలో ఉన్నట్టు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ అన్నారు. సాహిల్, షకీల్ ఇద్దరు దుబాయ్ లో ఉన్నట్లు సమాచారం తెలిసిందన్నారు. ప్రధాన నిందితుడు సాహిల్ తో పాటు.. మాజీ ఎమ్మెల్యే షకీల్ పై కూడా లుక్ ఔట్ నోటీసులు జారీ చేశామన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేశామని క్లారిటీ ఇచ్చారు. పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావు, బోధన్ మాజీ సీఐ ప్రేమ్ కుమార్ లను అరెస్ట్ చేసి జడ్జ్ ముందు ప్రవేశపెట్టామన్నారు. వారిద్దరికి పర్సనల్ బాండ్ పైన కోర్టు బెయిల్ ఇచ్చిందని తెలిపారు. ఈ కేసులో మొత్తం 16 మంది పై కేసు నమోదు చేశామని. నిందితులకు పోలీసులు సహకరించినట్లు గుర్తించామని అన్నారు. జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో మార్చ్ 2022 లో యాక్సిడెంట్ జరిగిందని, ఈ యాక్సిడెంట్ లో ఒక బాబు చనిపోయాడని అన్నారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ ని తప్పించారనే వార్తలు వచ్చాయని.. ఆ కేసును కూడా తిరిగి విచారణ చేస్తామని, ఆ కేసులో కోర్టులో ట్రయల్ జరుగుతుందన్నారు.

ప్రజాభవన్ వద్ద బారికేడ్లు కొట్టి పారిపోయిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ను కేసు నుంచి తప్పించారని ఆరోపణలు రావడంతో సిఐ దుర్గారావును అధికారులు సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పరారీలో ఉన్న దుర్గారావును సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని రేణిగుంటలో పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం నాంపల్లి కోర్టు న్యాయమూర్తి నివాసంలో ఆయనను హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి దుర్గారావుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. పోలీసుల విచారణకు సహకరించాలని, దేశం విడిచి వెళ్లవద్దని ఆదేశించారు. కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు 16 మంది నిందితుల్లో 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గురు పరారీలో ఉన్నా‌రు. ప్రధాన నిందితుడు సాహిల్, అతని తండ్రి షకీల్, మరో ఇద్దరు దుబాయ్‌లో ఉండటంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఒక్కరిని తప్పించే క్రమంలో 16మంది నిందితులుగా మారారు. తప్పు చేయడం ఒక ఎత్తెతే.. ఆ తప్పును కప్పిపుచ్చడం ఇంకా నేరం. తప్పు ఎవరుచేసినా.. శిక్ష తప్పదు అనటానికి ఈ కేసే నిదర్శనం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..