AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: చిరుత సంచారం.. భయంతో వణికిపోతున్న ఆ జిల్లా వాసులు!

Mahabubnagar: ఆ ప్రాంతంలో రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లాలంటే వణికిపోతున్నారు. పశువులను బటయకు తీసుకెళ్లి మేపాలంటే భయపడి వాటిని ఇంటి వద్దనే కట్టేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అసలు ఈ జనాలు ఇంతలా ఎందుకు భయపడుతున్నారో తెలుసుకుందాం పదండి.

Telangana: చిరుత సంచారం.. భయంతో వణికిపోతున్న ఆ జిల్లా వాసులు!
Mahabubnagar News
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Jul 27, 2025 | 2:53 PM

Share

ఆ ప్రాంతంలో రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లాలంటే వణికిపోతున్నారు. పశువులను బటయకు తీసుకెళ్లి మేపాలంటే భయపడి వాటిని ఇంటి వద్దనే కట్టేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వీళ్లు ఇంతలా భయపడుతుంది చిరుత పులల సంచారంతో.. గత కొన్ని రోజులుగా మహబూబ్ నగర్ జిల్లాలో చిరుత పులుల సంచారం హడలెత్తిస్తోంది. ఇప్పటికే జిల్లా కేంద్రానికి సమీపంలో గుట్టలో చిరుత పులి సంచారం భయాందోళనకు గురిచేస్తుండగా తాజాగా కోయిలకొండ మండలం కొత్లాబాద్ శివారులో గొర్రెల మంద, మనుషులపై దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.

తాజాగా జరిగిన చిరుతపులి దాడిలో ఒక గొర్రెల కాపరితో పాటు మరో ఇద్దరు రైతులకు గాయాలు అయ్యాయి. అంతేకాకుండా ఈ క్రూరమృగం దాడిలో నాలుగు గొర్రెలు మృతి చెందాయి. గమనించిన స్థానికులు కేకలు వేయడంతో చిరుతపులి అక్కడి నుంచి పారిపోయింది. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు గాయపడిన రైతులను స్థానిక హాస్పిటల్‌కు తరలిచారు. ఆ తర్వాత అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

మరోవైపు చిరుత దాడి సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు హుటాహుటిన ఘటన స్థలికి చేరుకున్నారు. చిరుత పాదముద్రల ఆధారంగా అది సంచరించిన ప్రాంతాలను గమనించి.. దాన్ని బంధించేందుకు బోన్‌లు ఏర్పాటు చేశారు. అయితే చిరుత సంచారంతో స్థానిక జనాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా చిరుతను పట్టుకొని తమను రక్షణ కల్పించాలని అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..