AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MBBS Admissions 2025: కొలిక్కిరాని లోకల్‌ కోటా లొల్లి..! ఎంబీబీఎస్‌ రిజిస్ట్రేషన్ల గడువు పొడిగిస్తూ ప్రకటన జారీ

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాల కోసం కన్వీనర్‌ కోటా కింద రిజస్ట్రేషన్ల గడువును కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు జులై 25వ తేదీతో రిజిస్ట్రేషన్ల గడువు ముగిసింది. అయితే లోకల్ కోటా పంచాయితీ ఇంకా..

MBBS Admissions 2025: కొలిక్కిరాని లోకల్‌ కోటా లొల్లి..! ఎంబీబీఎస్‌ రిజిస్ట్రేషన్ల గడువు పొడిగిస్తూ ప్రకటన జారీ
KNRUHS MBBS Admissions
Srilakshmi C
|

Updated on: Jul 27, 2025 | 3:50 PM

Share

హైదరాబాద్‌, జులై 27: రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాల కోసం కన్వీనర్‌ కోటా కింద రిజస్ట్రేషన్ల గడువును కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు జులై 25వ తేదీతో రిజిస్ట్రేషన్ల గడువు ముగిసింది. స్థానిక, స్థానికేతర అంశంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వినతులు వెళ్లువెత్తడంతో వర్సిటీ రిజిస్ట్రేషన్‌ తుది గడువును పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది. తాజా ప్రకటన మేరకు జులై 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తుది గడువును పొడిగించింది.

మరోవైపు మెడికల్‌ ప్రవేశాల్లో స్థానిక, స్థానికేతర అంశం నానుతూనే ఉంది. ఇప్పటికే దీనిపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయగా.. ఆగస్టు 5న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. కోర్టు తీర్పు మేరకు ప్రవేశాలు కల్పించేందుకు కాళోజీ వర్సిటీ సైతం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటి వరకు మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 17 వేల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని, వీరిలో జీవో 33 ప్రకారం 300 మంది వరకు తెలంగాణ స్థానికేతరులుగా ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల పిల్లలే అధికంగా ఉన్నారు. అలాగే సైనిక్‌ పాఠశాలల్లో చదివిన విద్యార్ధులు కూడా వరుసగా నాలుగేళ్లు రాష్ట్రంలో చదవకపోవడం వల్ల స్థానికేతరులుగా మిగిలిపోయారు.

దీంతో వీరంతా రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో లోకల్‌ కోటా కింద ప్రవేశాలు పొందడంలో నష్టపోతున్నారు. ఈ క్రమంలో 2023 నుంచి ఇప్పటివరకు ఎంతమంది అభ్యర్థులు స్థానికేతరుల కింద దరఖాస్తు చేశారో.. వారిలో ఎంతమంది కోర్టును ఆశ్రయించారనే వివరాలు అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక స్థానికత అంశం కొలిక్కి వచ్చేలోగా పీడబ్ల్యూడి, ఎస్సీ, ఎస్టీ తదితర కోటాల కింద రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని కాళోజీ వర్సిటీ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..