AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Congress: వద్దనుకుంటున్నారా..? వదిలేద్దామనుకుంటున్నారా..? పొత్తులపై కాంగ్రెస్ సైలెంట్..

Telangana alliance politics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.. ఎన్నికల కమిషన్ కూడా త్వరలో ఎన్నికలు జరుగుతాయంటూ తేల్చేసింది.. దీంతో ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. ఈ క్రమమంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలను రచిస్తోంది. దీనికోసం ఓ ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.. అయితే, పొత్తుల విషయంలో కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు వేస్తుందా..?

Telangana Congress: వద్దనుకుంటున్నారా..? వదిలేద్దామనుకుంటున్నారా..? పొత్తులపై కాంగ్రెస్ సైలెంట్..
CPI Congress CPM
TV9 Telugu
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Sep 25, 2023 | 12:25 PM

Share

Telangana alliance politics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.. ఎన్నికల కమిషన్ కూడా త్వరలో ఎన్నికలు జరుగుతాయంటూ తేల్చేసింది.. దీంతో ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. ఈ క్రమమంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలను రచిస్తోంది. దీనికోసం ఓ ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.. అయితే, పొత్తుల విషయంలో కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు వేస్తుందా..? తొందరపడి చేయి కాల్చుకోవద్దనే సామెతను టీ కాంగ్రెస్ ఫాలో అవుతుందా..? కలసి వస్తామన్నా పార్టీలను ఎందుకు హోల్డ్ చేసింది..? గత కూటమి తీర్పు కాంగ్రెస్‌ను ఆలోచనలో పడేసిందా..? పొత్తుల విషయంలో హస్తం పార్టీ ఆలోచన ఏంటి..? అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సెన్సెషన్‌గా మారింది.

అయితే, పొత్తుల విషయంలో టీ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముందుండి కూటమిని ఏర్పాటు చేసింది. కానీ, ఆ తర్వాత వచ్చిన ఫలితాలు కాంగ్రెస్‌ను కోలుకోలేని దెబ్బతీశాయి. దీంతో మరోసారి అలా జరగకుండా పొత్తు విషయంలో సైలెన్స్ మెయిటైన్ చేస్తోంది హస్తం పార్టీ. ఒక మెట్టు దిగొస్తే సీపీఐ, సీపీఎంలతో పాటు టీజేఏస్, బీఏస్పీ పార్టీలు కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ ఆ పార్టీలకు కాంగ్రెస్ అవకాశం ఇవ్వడం లేదు. కాంగ్రెస్ పొత్తుకు సిద్ధపడితే ఆపార్టీ గెలిచే మెజారిటీ స్థానాలు పొత్తులో భాగంగా మిత్ర పక్షాలకు ఇవ్వాలి.. దీన్ని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ నేతలు పొత్తు విషయంలో విముఖతతో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

అయితే, లెఫ్ట్ పార్టీలతో పాటు మిగతా పార్టీలు కూడా.. వారే ఒక మెట్టుదిగి కాంగ్రెస్ నిర్ణయాన్ని ఆమోదిస్తే తప్ప కాంగ్రెస్ పొత్తుకు సిద్దపడేలా లేదు. దీంతో పాటు కేసీఆర్ పక్కన పెట్టడం వల్లే కమ్యూనిస్టు పార్టీలు తమ దగ్గరకు వస్తున్నాయని హస్తం నేతలు భావిస్తున్నారు. ఎక్కువ టికెట్ల కోసం లెఫ్ట్ తో పాటు ఇతర పార్టీలు, తమ మాటే చెల్లుబాటు కావాలని కాంగ్రెస్ భీష్మించుకుని కూర్చున్నాయి. దీంతో పొత్తు విషయంలో ఏటూ తేలని పరిస్థితి ఏర్పడింది. ఏదిఏమైనా పొత్తు చిత్తుతో కావాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత హస్తం పార్టీపై ఉందని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.. అయితే, చివరగా పొత్తుల విషయంలో టీ కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే.. వేచి చూడాల్సిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..