PM Modi: తెలంగాణ కమలదళంలో జోష్.. ఎన్నికల సమర శంఖం పూరించనున్న ప్రధాని మోడీ.. ఫుల్ షెడ్యూల్ ఇదే..

Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో భారతీయ జనతా పార్టీ అధికారమే లక్ష్యంగా పావులుకదుపుతోంది. దీనిలో భాగంగా వ్యూహాలకు పదును పెట్టిన బీజేపీ అధిష్టానం.. తెలంగాణ నేతలకు కీలక సూచనలు చేసింది. ఎన్నికలకు సమయం లేదని.. ఇక స్పీడును పెంచాలంటూ అధిష్టానం ఆదేశించింది. దీని ప్రకారమే భారతీయ జనతా పార్టీ నేతలు వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు.

PM Modi: తెలంగాణ కమలదళంలో జోష్.. ఎన్నికల సమర శంఖం పూరించనున్న ప్రధాని మోడీ.. ఫుల్ షెడ్యూల్ ఇదే..
PM Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 25, 2023 | 1:08 PM

Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో భారతీయ జనతా పార్టీ అధికారమే లక్ష్యంగా పావులుకదుపుతోంది. దీనిలో భాగంగా వ్యూహాలకు పదును పెట్టిన బీజేపీ అధిష్టానం.. తెలంగాణ నేతలకు కీలక సూచనలు చేసింది. ఎన్నికలకు సమయం లేదని.. ఇక స్పీడును పెంచాలంటూ అధిష్టానం ఆదేశించింది. దీని ప్రకారమే భారతీయ జనతా పార్టీ నేతలు వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా, అగ్రనేతలు సైతం తెలంగాణ బాట పడుతూ ఎప్పటికప్పుడు కాషాయ పార్టీ నేతలను సమాయత్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం హైదరాబాద్ లో పర్యటించారు. తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన్న అమిత్ షా.. నేతలతో భేటీ అయి ఎన్నికల కార్యచరణపై చర్చించారు. అంతేకాకుండా.. అధిష్టానం సూచనలను తప్పక పాటించాలని.. ఐకమత్యంతో ముందుకెళ్లాలని.. ఇకపై అగ్రనేతలంతా ఎప్పటికప్పుడు తెలంగాణలో పర్యటిస్తారని కూడా హామీనిచ్చారు. అయితే, బీజేపీ వ్యూహంలో భాగంగా అగ్రనేతలంతా తెలంగాణకు క్యూకట్టనున్నారు. అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో.. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం రంగంలోకి దిగుతున్నారు. అక్టోబరు 1న మహబూబ్‌నగర్ వేదికగా ప్రధాని మోడీ ఎన్నికల సమరశంఖం పూరించనున్నారు. బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపడంతోపాటు.. ఎన్నికలకు సిద్ధమయ్యేలా పలు సూచనలు చేయనున్నారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు సంబంధించి ఇప్పటికే టూర్ షెడ్యూల్ ఖరారు అయ్యింది.

అక్టోబర్ 1న శనివారం (శనివారం) మధ్యాహ్నం 12.30 గంటలకు మహబూబ్‌నగర్‌ పట్టణ శివార్లలోని భూత్‌పూర్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించి అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. మోడీ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ భారీ జనసమీకరణకు ప్లాన్ చేస్తోంది. అయితే, ప్రధాని మోడీ సభ ఎన్నికలకు ముందు కీలకం కానుంది. ఓ వైపు సభతో పార్టీ కేడర్‌ను సమాయత్తం చేయడం.. మరోవైపు నేతలకు కీలక సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే టార్గెట్‌గా ప్రధాని మోదీ ప్రసంగం ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రధాని మోదీ సభ తర్వాత బీజేపీ కూడా అభ్యర్థుల జాబితాను పార్టీ అధిష్టానం వెల్లడించే ఛాన్స్ ఉంది. ప్రధాని మోడీతోపాటు.. బీజేపీ అగ్రనేతలు హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా త్వరలో జరిగే సమావేశాల్లో పాల్గొననున్నారు. మోడీ సభ అనంతరం 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో, 119 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పార్టీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తోంది.

వాస్తవానికి మొదట సెప్టెంబర్‌ 28, 29 తేదీల్లోనే ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తారని అందరూ భావించారు. కానీ అది వచ్చేనెలకు ఖరారు చేశారు. తొలుత అక్టోబరు 2న టూర్‌ ఖరారు చేసినా.. చివరికి షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేస్తూ ఒకటవ తేదీన మహబూబ్‌నగర్‌ సభలో పాల్గొంటారని తెలిపారు. పాలమూరులో ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేసే దిశగా రాష్ట్ర నాయకత్వం కార్యాచరణ సిద్ధం చేస్తూ.. కమిటీలను సిద్ధం చేస్తోంది. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను మోడీ సభకు తరలించేలా ప్లాన్ రచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..