Telangana: పరీక్షలు బాగా రాయలేదని ఆత్మహత్య.. తీరా రిజల్ట్స్ వచ్చాక మార్కులు చూస్తే…

ఇంటర్ పరీక్షలు బాగా రాయలేకపోయాననే బాధతో గత నెల 10న ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. కానీ ఆ యువకుడికి ఇవాళ విడుదలైన ఇంటర్ ఫలితాలలో టాప్ మార్కులు వచ్చాయి. దీంతో అతడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Telangana: పరీక్షలు బాగా రాయలేదని ఆత్మహత్య.. తీరా రిజల్ట్స్ వచ్చాక మార్కులు చూస్తే...
Krishna
Follow us
Ram Naramaneni

|

Updated on: May 10, 2023 | 10:08 AM

ఇంటర్‌లో ఫెయిల్ అయ్యామని మనస్థాపంతో తెలంగాణవ్యాప్తంగా 8 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. జగిత్యాల జిల్లా మేడిపల్లిలో ఒకరు, హైదరాబాద్‌లో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కి చెందిన మరొకరు, పటాన్‌చెరులో ఇంకొకరు, హైదరాబాద్‌లో చదువుతున్న గద్వాల్‌కు చెందిన మరో స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. సికింద్రాబాద్ నేరెడ్‌మెట్‌లో ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ రేవంత్ కుమార్, హైదరాబాద్‌లో చదువుతున్న ప్రకాశం జిల్లాకి చెందిన మరో విద్యార్థిని, ఖైరతాబాద్‌లో గౌతమ్ కుమార్ సూసైడ్ చేసుకున్నాడు. కొత్తకోటకు చెందిన మరో విద్యార్థిని మార్కులు తక్కువ వచ్చాయని ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

రిజల్ట్స్ రాకముందే సూసైడ్.. ఇప్పుడు  ఏ గ్రేడ్​లో పాస్

మరో గుండె తరుక్కుపోయే ఘటన ఇది. ఇంటర్ ఫలితాలు వెలువడక ముందే పరీక్షల్లో ఫెయిల్ అవుతానని ఆందోళన చెందిన కృష్ణ ఉరివేసుకొని ఆత్మహత్యకు చేసుకున్నాడు. కానీ ఫలితాల్లో ఆ విద్యార్థి ఏ గ్రేడ్‌లో ఉత్తీర్ణత సాధించాడు. ఇంటర్ ఫలితాల్లో 1000 మార్కులకుగానూ 892 మార్కులు సాధించిన కృష్ణ ఏ గ్రేడ్‌లో ఉత్తీర్ణుడయ్యాడు.  మహబూబాబాద్​ జిల్లా కేసముద్రం మండలం బోడగుట్ట తండాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. తండాకు చెందిన గుగులోతు లచ్చు, జ్యోతి దంపతుల పెద్ద కొడుకు కృష్ణ (19) ఏటూరు నాగారంలోని గిరిజన గురుకుల కళాశాలలో ఇంటర్​( బైపీసీ) కంప్లీట్ చేశాడు. గత నెల ఎగ్జామ్స్ రాసి ఇంటికి వచ్చాడు.

చిన్నప్పటి నుంచి MBBS చేయాలని కలలు కనేవాడు. అయితే, ఎగ్జామ్స్ బాగా రాయలేదని, ఫెయిల్​ అవుతానని, దాంతో MBBS​ చేయలేనని ఆవేదన చెందాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌‌‌‌ 10న..  ‘‘అమ్మ, నాన్న క్షమించండి, నాకు MBBS​లో సీటు రాదు.. అందుకనే  చనిపోతున్నాను’’ అని సూసైడ్​ లెటర్​ రాసి ఉరి వేసుకొని తనువు చాలించాడు. మంగళవారం రిలీజ్​ అయిన ఇంటర్‌‌‌‌ రిజల్ట్స్‌లో కృష్ణ  1000  మార్కులకు 892 మార్కులు సాధించి ఏ గ్రేడ్‌‌‌‌లో పాసయ్యాడు. దీంతో కృష్ణ తల్లిదండ్రులు.. గుండెలవిసేలా రోదిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం