Telangana 10th Class Results 2023: పదో తరగతి ఫలితాల విడుదల.. రిజల్ట్స్ ఇక్కడ తెలుసుకోండి..

శివలీల గోపి తుల్వా

|

Updated on: May 10, 2023 | 1:42 PM

TS SSC Results 2023 highlights: తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలో మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల అయ్యాయి. విద్యార్ధులు తమ..

Telangana 10th Class Results 2023: పదో తరగతి ఫలితాల విడుదల.. రిజల్ట్స్ ఇక్కడ తెలుసుకోండి..
TS SSC Results 2023

పదో తరగతి ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి..

TS SSC Results 2023 highlights: విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతగానో ఎదురు చూస్తున్న పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయ్. తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలో మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. విద్యార్ధులు తమ ఫలితాలను  bse.telangana.gov.inbseresults.telangana.gov.in,  https://tv9telugu.com వెబ్‌సైట్లలో చెక్‌ చేసుకోవచ్చు..

పదో తరగతి ఫలితాలు వచ్చేశాయ్..  పదో తరగతి పరీక్షలకు హాజరైన 4.4 లక్షల మంది విద్యార్ధులు హాజరు కాగా, వారిలో 86.60 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక గతంలో లాగానే ఈ ఏడాది కూడా టెన్త్ ఫలితాల్లో బాలికలే పైచేయిగా నిలిచారు. ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా పదో తరగతి ఫలితాలలో బాలికలదే పైచేయిగా ఉంది. పరీక్ష రాసిన బాలికలలో 88.53 శాతం మంది పాసవ్వగా, బాలురిలో 84.68 శాతం మంతి ఉత్తీర్ణులయ్యారు. ఇక ఈ రోజు విడుదలైన పదో తరగతి ఫలితాలలో 99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఇక 59.46 శాతం మాత్రమే కలిగిన వికరాబాద్ పరీక్షా ఫలితాల్లో చివరి స్థానంలో ఉంది.

మరోవైపు పదో తరగతి పరీక్షా ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు ప్రథమ భాషలో 98.17 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే ద్వితీయ భాషలో 99.70 శాతం, తృతీయ భాషలో 98.45 పర్సంటేజ్ మంది పాసయ్యారు. ఇంకా మ్యాథ్స్‌లో 91.65, సైన్స్‌లో 93.91, సోషల్‌లో 98.83 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

నేడు విడుదలైన తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం విద్యాశాఖ సప్లిమెంటరీ తేదీలను ప్రకటించింది. ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 14 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఫెయిల్ అయిన విద్యార్థుల సప్లీమెంటరీ పరీక్ష కోసం ఈ నెల 26వ తేదీ లోపు సంబంధిత పాఠశాల ప్రిన్సిపాల్ లేదా హెడ్ మాస్టర్‌కి ఎగ్జామ్ ఫీజు చెల్లించాలి.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 10 May 2023 12:38 PM (IST)

    పదో తరగతి ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి..

  • 10 May 2023 12:35 PM (IST)

    ఏ సబ్జెక్ట్‌లో ఎంత ఉత్తీరత అంటే..

    పదో తరగతి పరీక్షా ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు ప్రథమ భాషలో 98.17 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే ద్వితీయ భాషలో 99.70 శాతం, తృతీయ భాషలో 98.45 పర్సంటేజ్ మంది పాసయ్యారు. ఇంకా మ్యాథ్స్‌లో 91.65, సైన్స్‌లో 93.91, సోషల్‌లో 98.83 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

  • 10 May 2023 12:30 PM (IST)

    సప్లీమెంటరీ పరీక్ష కోసం ఏం చేయాలంటే..

    నేటి పదో తరగతి ఫలితాలలో ఫెయిల్ అయిన విద్యార్థుల సప్లీమెంటరీ పరీక్ష కోసం ఈ నెల 26వ తేదీ లోపు సంబంధిత పాఠశాల ప్రిన్సిపాల్ లేదా హెడ్ మాస్టర్‌కి ఎగ్జామ్ ఫీజు చెల్లించాలి.

  • 10 May 2023 12:25 PM (IST)

    100 శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు..

    ఈ సంవత్సరం జరిగిన పదో తరగతి పరీక్షలలో 2,793 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణతను సాధించాయి. మరోవైపు రాష్ట్రంలోని 25 పాఠశాలలు సున్నా శాతం ఉత్తీర్ణత ఫలితాలను పొందాయి..

  • 10 May 2023 12:21 PM (IST)

    జూన్ 14 నుంచి సప్లిమెంటరీ..

    నేడు విడుదలైన తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం విద్యాశాఖ సప్లిమెంటరీ తేదీలను ప్రకటించింది. ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 14 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.

  • 10 May 2023 12:18 PM (IST)

    అగ్రస్థానంలో నిర్మల్‌…

    ఈ రోజు విడుదలైన పదో తరగతి ఫలితాలలో 99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఇక 59.46 శాతం మాత్రమే కలిగిన వికరాబాద్ పరీక్షా ఫలితాల్లో చివరి స్థానంలో ఉంది.

  • 10 May 2023 12:12 PM (IST)

    ఈ సారి కూడా బాలికలదే పైచేయి..

    ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా పదో తరగతి ఫలితాలలో బాలికలదే పైచేయిగా ఉంది. పరీక్ష రాసిన బాలికలలో 88.53 శాతం మంది పాసవ్వగా, బాలురిలో 84.68 శాతం మంతి ఉత్తీర్ణులయ్యారు.

  • 10 May 2023 12:10 PM (IST)

    ఫలితాలు వచ్చేశాయ్

    పదో తరగతి ఫలితాలు వచ్చేశాయ్..  పదో తరగతి పరీక్షలకు హాజరైన 4.4 లక్షల మంది విద్యార్ధులు హాజరు కాగా, వారిలో 86.60 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక గతంలో లాగానే ఈ ఏడాది కూడా టెన్త్ ఫలితాల్లో బాలికలే పైచేయిగా నిలిచారు.

  • 10 May 2023 11:24 AM (IST)

    ఎలా చెక్ చేసుకోవాలంటే..

    10వ తరగతి రిజల్ట్స్ విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్ధులు తమ ఫలితాలను https://tv9telugu.com వెబ్‌సైట్లలో చెక్‌ చేసుకోవచ్చు..

  • 10 May 2023 11:06 AM (IST)

    గ్రేడింగ్ సిస్టమ్ ఎలా అంటే..

    నేడు విడుదల కానున్న పదో తరగతి ఫలితాలలో వివిధ సబ్జెక్టుల్లో 10 పాయింట్లు తెచ్చుకున్నవారికి ఏ1 గ్రేగ్ ఇస్తారు. అలాగే 9 పాయింట్లకు ఏ2, 8 పాయింట్స్‌కి బీ1, 7కి బీ2 గ్రేడ్ అందుతుంది. ఇంకా ఏదైనా సబ్జెక్ట్‌లో 6 పాయింట్లు తెచ్చుకున్నవారికి సీ1 గ్రేడ్, 5 పాయింట్లకు సీ2, చివరాఖరిగా 4 గ్రేడ్ పాయింట్లు తెచ్చుకున్నవారికి డీ గ్రేడ్ వస్తుంది. 4 కంటే తక్కువ గ్రేడింగ్ పాయింట్లు తెచ్చుకున్నవారు ఆ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారని అర్థం.

  • 10 May 2023 11:02 AM (IST)

    ఎంత మంది పరీక్ష రాశారంటే..

    ఈ ఏడాది ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు 4,84,370 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు.

  • 10 May 2023 11:01 AM (IST)

    విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదగా..

    TS SSC Results 2023: తెలంగాణ పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొద్ది ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను www.tv9telugu.comలో కూడా చూడొచ్చు.

Published On - May 10,2023 10:56 AM

Follow us