Komatireddy Raj Gopal Reddy: అదంతా ఉత్తమాటే.. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయంటూ నాలుగు రోజులుగా తీవ్ర ప్రచారం జరుగుతోంది. ప్రధాన పార్టీల్లో మార్పులు, చేరికలు జరుగుతున్నాయంటూ ఊహగానాలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో ఇప్పటికే పార్టీ మారిన పలువురు కీలక నేతలు.. కాంగ్రెస్ వైపు చూస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయంటూ నాలుగు రోజులుగా తీవ్ర ప్రచారం జరుగుతోంది. ప్రధాన పార్టీల్లో మార్పులు, చేరికలు జరుగుతున్నాయంటూ ఊహగానాలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో ఇప్పటికే పార్టీ మారిన పలువురు కీలక నేతలు.. కాంగ్రెస్ వైపు చూస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో పలు పార్టీల్లో అలజడి మొదలైంది. తెలంగాణలో హస్తం పార్టీ పుంజుకుంటుందా..? లేదా.. ఏదైనా మార్పు జరుగుతుందన్న విషయం పక్కన పెడితే.. ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ సొంత గూటికి వస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే. ఈ ప్రచారంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
తాను జీజేపీకి రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీతోనే తన ప్రయాణమని.. కావాలనే తప్పుడు ప్రచారం చేసి.. తన అభిమానులను గజిబిజి చేస్తున్నారంటూ పేర్కొన్నారు. ఈ ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మొద్దంటూ కోమటిరెడ్డి సూచించారు. వచ్చే ఎన్నికల్లోనూ తాను బీజేపీ తరపున మునుగోడు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని ట్వీట్ చేసి వెల్లడించారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన అనంతరం రాజగోపాల్ రెడ్డి మునుగోడులో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిపై ఓడిపోయిన విషయం తెలిసిందే.
My political opponents are spreading rumours of me changing party. It’s a lie. I’m staying with BJP and contesting from Munugode. They aim to confuse my supporters.
— Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) May 17, 2023
అయితే, కార్ణటకలో కాంగ్రెస్ గెలుపు అనంతరం ఆపార్టీలో చేరికలు పెరుగుతాయంటూ ప్రచారం జరుగుతోంది. జూపల్లి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఏ పార్టీలోకి చేరుతున్నారనేది ఇంకా వారు నిర్ణయం తీసుకోలేదు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..