Heat Wave: బాబోయ్.. సూరీడుతో బీకేర్‌ఫుల్.. తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం.. బయటకు రాకపోవడమే బెటర్..
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలు పెరిగిపోతున్నాయి. ఎండ వేడికి జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 దాటితేనే ఎండల తీవ్రత పెరిగిపోతుంది. ఇక మిట్ట మధ్యాహ్నం వేళలో బయటికి వెళ్లే పరిస్థితి కూడా లేదు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలు పెరిగిపోతున్నాయి. ఎండ వేడికి జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 దాటితేనే ఎండల తీవ్రత పెరిగిపోతుంది. ఇక మిట్ట మధ్యాహ్నం వేళలో బయటికి వెళ్లే పరిస్థితి కూడా లేదు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. సాయంత్రం 5 దాటినా వేడి తీవ్రత ఉంటుంది. ఎండ తీవ్రతను తట్టుకోలేక చాలా మంది అస్వస్థతకు గురవుతున్నారు. వడదెబ్బతో జనం పిట్టల్లా రాలుతున్నారు. రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు అన్ని చోట్ల 44 డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో అత్యధికంగా 46 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
వడదెబ్బతో ఇప్పటివరకూ ఏపీలో 13 మంది చనిపోగా.. తెలంగాణలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఎండల తీవ్రత వల్ల దినసరి కూలీలు నానా అవస్థలు పడుతున్నారు. ఉపాధి హామీ పనులకు వెళుతున్న కూలీలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఎండ తీవ్రత, వేడిగాల్పుల వల్ల కూలీలు వడదెబ్బకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు. అందుకే సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం బయటకు రాకపోవడమే బెటర్ అంటూ పేర్కొంటున్నారు.
ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిన నేపథ్యంలో వడదెబ్బ ప్రభావానికి గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు చెబుతున్నారు.. మిట్టమధ్యాహ్నం బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోహిణి కార్తె వస్తే ఎండలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇందుకు ఇంకా ఎనిమిది రోజులు ఉండగానే ఎండ దంచేస్తున్నాయి.. ఇవేమి ఎండలు..? బాబోయ్ అంటూ జనం ఇళ్లకే పరిమితమైపోతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం