- Telugu News Photo Gallery Cold for a while then hot, Hourly changing weather in Paderu, Alluri district of AP
Paderu Weather: గంటగంటకు మారుతున్న వాతావరణం.. పాడేరులో వింత అనుభవం.. చూస్తేనే..
ఏపీలోని జిల్లాలు అన్నీ ఒక్క లెక్క..ఆ ఒక్క జిల్లాలో మరోలెక్క అన్నట్లు ఉంది పరిస్థితి..ఏపీలోని అన్నీ జిల్లాల్లో ఎండలు దంచేస్తుంటే..ఒక మన్యం జిల్లాలో మాత్రం దట్టంగా పొగ మంచు కమ్మేస్తోంది..
Updated on: May 18, 2023 | 10:07 AM

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలు పెరిగిపోతున్నాయి. ఎండ వేడికి జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 దాటితేనే ఎండల తీవ్రత పెరిగిపోతుంది. ఇక మిట్ట మధ్యాహ్నం వేళలో బయటికి వెళ్లే పరిస్థితి కూడా లేదు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఇదిలావుంటే ఏపీలోని మన్యం జిల్లాల్లో మరోలా ఉంది. మంచులో మన్యం తడిసిపోతోంది.

ప్రకృతి అందాలకు నెలవైన మన్యం జిల్లాలో విభిన్న వాతావరణం కనిపిస్తోంది. మండు వేసవిలోనూ మన్యం వాసులు చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు.

వేకువజాము నుంచి ఉదయం 8 గంటల వరకు పాడేరు, అరకు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కురుస్తోంది.

శీతాకాలం తలపించే విధంగా పొగమంచుతో గిరిజనులు అవస్థలు పడ్డారు..ఇక సూర్యోదయం తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు.

ఆ సమయంలో అధిక ఎండకు తాళలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గొడుగులను ఆశ్రయిస్తున్నారు. 35 నుంచి 37 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఉదయం సమయంలో పొగమంచు దట్టంగా కురుస్తుండగా, మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోతున్నాయి.

ఆ తర్వాత వాతావరణం సాయంత్రానికి మళ్లీ చల్లబడుతుంది..ఇలా ఏజెన్సీలో భిన్నమైన వాతావరణం నెలకొంటుంది..

అల్లూరి జిల్లా పాడేరులో మారిన వాతావరణం ఆందోళనకు గురిచేస్తోంది. పొద్దున్నే ఆరు నుంచి ఎనిమిది వరకు కురుస్తున్న పొగ మంచు.. ఉదయం పది తర్వాత మెల్లగా మొదలైన ఎండగా మారుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు భానుడు ప్రతాపం చూపిస్తుండగా.. సాయంత్రానికి తిరిగి చల్లబడుతోంది వాతావరణం.





























