Kishan Reddy: ఆ కులగణనకు చట్టబద్ధత లేదు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణ ప్రభుత్వ కుల సర్వేకు చట్టబద్ధత లేదని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జనగణన ద్వారా తీసే కులాల లెక్కలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. హైదరాబాద్‌లో నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది.

తెలంగాణ ప్రభుత్వ కుల సర్వేకు చట్టబద్ధత లేదని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జనగణన ద్వారా తీసే కులాల లెక్కలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. హైదరాబాద్‌లో నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. జనగణనలో కులగణన చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఈ సమావేశంలో చర్చించారు. కులగణనపై కేంద్రం నిర్ణయం తీసుకోవడం రాహుల్ గాంధీ విజయమని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ అంశంలో తెలంగాణ కాంగ్రెస్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేలా బీజేపీ నేతలకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
కులగణన ఎలా చేస్తారనే అంశంపై రాష్ట్ర నేతలకు వివరించిన కిషన్ రెడ్డి..బ్రిటిష్ కాలంలో చేసిన చేసిన కులగణన తర్వాత.. ప్రస్తుతం బీజేపీ కులగణన చేస్తోందన్న అంశాన్ని జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు. ఉమ్మడి పది జిల్లాల వారీగా అన్ని కులసంఘాలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించాలని.. కులగణనకు కుల సర్వేకు ఉన్న తేడాను వివరించాలని బీజేపీ నేతలకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ ప్రభుత్వ కుల సర్వేకు చట్టబద్ధత లేదని జనగణన ద్వారా తీసే కులాల లెక్కలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు కిషన్ రెడ్డి. పార్లమెంట్లో జనగణన చట్టానికి సవరణ చేసి కులాల లెక్కలు తీస్తామని.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల సర్వే రోల్ మోడల్ కాదని కిషన్ రెడ్డి తెలిపారు.
స్వతంత్ర భారతదేశంలో తొలిసారి జనగణనలో కులగణన చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయంతీసుకుంది. రెండు, మూడు నెలల్లో కులగణన చేసేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది. 15 రోజుల్లో కులగణన ప్రక్రియ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




