AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana : కూతురితో కలిసి నీట్‌ పరీక్ష రాసిన తల్లి.. ఎక్కడో తెలుసా!

వివాహం విద్య నాశాయ'..అనేది పాత సామెత! పెళ్లయితే చదువు ముందుకు సాగదు అనేది మన పెద్దలు చెబుతుంటారు. కానీ, వివాహం, కుటుంబ బాధ్యతలు చదువుకు ఏమాత్రం అడ్డంకి కాదని నిరూపించింది ఓ తల్లి. పెళ్లయి ముగ్గురు పిల్లలు పుట్టాక..ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన పెద్ద కూతురితో కలిసి నీట్‌ పరీక్ష రాసింది. ఆ చదువుల తల్లి ఎవరో తెలుసుకుందాం పదండి.

Telangana : కూతురితో కలిసి నీట్‌ పరీక్ష రాసిన తల్లి.. ఎక్కడో తెలుసా!
Nalgonda
M Revan Reddy
| Edited By: Anand T|

Updated on: May 05, 2025 | 9:26 AM

Share

వివాహం విద్య నాశాయ’..అనేది పాత సామెత! పెళ్లయితే చదువు ముందుకు సాగదు అనేది మన పెద్దలు చెబుతుంటారు. కానీ, వివాహం, కుటుంబ బాధ్యతలు చదువుకు ఏమాత్రం అడ్డంకి కాదని నిరూపించింది ఓ తల్లి. పెళ్లయి ముగ్గురు పిల్లలు పుట్టాక..ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన పెద్ద కూతురితో కలిసి నీట్‌ పరీక్ష రాసింది. వివరాల్లోకి వెళితే..సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం మంచానాయక్‌ తండాకు చెందిన “బానోత్‌ సరిత” తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. కూతురుని ఉన్నత చదువులు చదివించి ప్రయోజకురాలిగా చేయాలని తల్లిదండ్రులు భావించారు. కానీ సరిత బీఎస్సీ నర్సింగ్‌ రెండో సంవత్సరం చదువుతుండగా.. మంచి అబ్బాయి దొరకడంతో చదువు ఆపేసి కూతురుకు అదే గ్రామానికి చెందిన భూక్యా కిషన్‌తో పెళ్లి చేశారు.

ఇక పెళ్లి తర్వాత ఈ  దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు పుట్టారు. అయితే పిల్లలు చదువు తుండడంతో తాను కూడా ఉన్నత విద్యను అభ్యసించాలని తల్లి సరిత భావించింది. ఒకవైపు కుటుంబ బాధ్యతలు మోస్తూనే.. మరోవైపు పిల్లలతో పాటు చదువుతూ తిరిగి ఇంటర్మీడియట్‌ను పూర్తి చేసింది.

ఇక ఇంటర్‌ పూర్తి చేసిన పెద్ద కూతురు ఖమ్మంలో నీట్‌ లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ తీసుకుంది. తాను కూడా నీట్ రాయాలని భావించిన సరిత. తాను కూడా కూతురితోపాటు ఖమ్మంలో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంది. ఇద్దరు పోటీ పడి నీట్ కోసం చదివారు. ఆదివారం జరిగిన నీట్ పరీక్షను తల్లి సరిత సూర్యాపేటలో రాయగా, కూతురు కావేరి ఖమ్మంలో నీట్ ఎగ్జామ్ రాశారు. తల్లి కూడా తనతో పాటే నీట్‌ పరీక్ష రాయటం సంతోషంగా ఉందని.. ఇద్దరం కలిసి ఖమ్మంలో ఒకే గదిలో ఉండి కోచింగ్‌ తీసుకున్నామని కూతురు కావేరి చెబుతోంది. భర్త సహకారంతో పిల్లలతో పాటు తాను కూడా కోచింగ్ తీసుకుని నీట్ ఎగ్జామ్ రాసానని సరిత చెబుతోంది. చదువుకోవాలనే పట్టుదల ఉంటే వయస్సు, వివాహం, కుటుంబ బాధ్యతలు ఏమాత్రం అడ్డు కాదని సరిత చెబుతున్నారు. కూతురుతో పాటు తల్లి కూడా నీట్ ఎగ్జామ్ రాయడాన్ని పలువురు అభినందిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.