AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Na Anveshana: అడ్డంగా బుక్కయిన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. కేసు నమోదు

ఓ ప్రపంచముదురు గత రెండు నెలలుగా బెట్టింగ్‌యాప్స్ ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు చేశాడు. శెభాష్ అని అందరూ మెచ్చుకున్నారు కూడా..దీంతో ఇంకా రెచ్చిపోయి ఉత్యాత్సాహం చూపించాడు. ఏకంగా తెలంగాణ అధికారులపైనే బెట్టింగ్ బాంబు వేశాడు. చివరకు కేసుల్లో ఇరుక్కున్నాడు. ఆ వివరాలు..

Na Anveshana: అడ్డంగా బుక్కయిన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. కేసు నమోదు
Naa Anveshana Fame Anvesh
Ravi Kiran
|

Updated on: May 05, 2025 | 9:23 AM

Share

ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఇష్టారీతిన ఆరోపణలు చేసేయడం, యూట్యూబ్‌లో ఎక్కించేయడం, వ్యూస్‌ కోసం అడ్డమైన థంబ్‌నైల్స్ పెట్టడం.. చివరకు కేసులు పడితే.. సారీ చెప్పి తప్పించుకోవడం..ఇదీ మన తెలుగురాష్ట్రాల్లో జరుగుతున్న తంతు. ఈక్రమంలోనే ఓ ప్రపంచముదురు గత రెండు నెలలుగా బెట్టింగ్‌యాప్స్ ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు చేశాడు. శెభాష్ అని అందరూ మెచ్చుకున్నారు కూడా.. దీంతో ఇంకా రెచ్చిపోయి ఉత్యాత్సాహం చూపించాడు. ఏకంగా తెలంగాణ అధికారులపైనే బెట్టింగ్ బాంబు వేశాడు. చివరకు కేసుల్లోఇరుక్కున్నాడు. ఇంతకూ అతగాడు చేసిన ఆరోపణలు నిరాధారమా..? ప్రపంచయాత్రికుడిగా నోటికొచ్చినట్లు మాట్లాడితే జరిగిన పర్యవసానమా.?

ఆధారాలతో సహా అన్నీ వివరంగా చెబుతానంటూ వీడియో చేయడం.. తీరా వీడియో అంతా నోటి మాటలు.. పచ్చి బూతులు.. తప్ప ఎలాంటి ఎవిడెన్స్ ఉండవు. ఇప్పుడిదే అన్వేష్ మెడకు చుట్టుకుంది. కేసులుదాకా వచ్చింది. తెలంగాణలో ప్రభుత్వమే బెట్టింగ్‌యాప్స్‌ను ప్రమోట్ చేసింది. అని అర్థం వచ్చేలా.. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు బెట్టింగ్ యాప్స్‌ కోసం కమిషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు చేస్తూ.. అన్వేష్ ఓ వీడియో విడుదల చేశాడు.

ఇల్లీగల్ బెట్టింగ్‌ యాప్స్‌లో మాజీ సీఎస్ శాంతకుమారి ప్రమేయం కూడా ఉందని.. మెట్రో ట్రైన్లలో బెట్టింగ్ యాప్స్‌కు ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ అన్వేష్ చేసిన అలిగేషన్స్.. చాలా దూరం వెళ్లాయి. ముఖ్యంగా డీజీపీ జితేందర్ రెడ్డిపై ఆయన చేసిన ఆరోపణలు పోలీస్ డిపార్ట్‌మెంట్‌కూ కోపం తెప్పించాయి. ఇప్పుడీ మాటలే పోలీస్ డిపార్ట్‌మెంట్‌ ఆగ్రహం తెప్పించాయి. తెలంగాణ డిజిపి జితేందర్ మెట్రో MD ఎన్ వి ఎస్ రెడ్డి, సీఎస్ శాంత కుమారి, దాన కిషోర్, వికాస్ రాజ్‌లపై ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేశాడు అన్వేష్. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు సమాచారం ప్రచారం చేశాడంటూ అన్వేష్ పై కానిస్టేబుల్ నవీన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసారు సైబరాబాద్ పోలీసులు.

300 కోట్లు లంచం తీసుకొని మూడు బెట్టింగ్ యాప్ లను ప్రోత్సహించారని డీజీపీతో పాటు సీనియర్ అధికారుల పేర్లను వెల్లడించాడు. బెట్టింగ్ యాప్‌లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఒకే ఒక్క కారణంతో ఇన్నాళ్లు జనాలు అన్వేష్ కి మద్దతు ఇచ్చారు. జనాన్ని బాగా బూతులు తిడితే తన యూట్యూబ్ ఛానెల్ కి బాగా వ్యూస్ వస్తున్నాయన్న కారణంతో ఇష్టమొచ్చినట్టు అందర్నీ తిట్టడం మొదలు పెట్టాడు ..ఇప్పుడు ఏకంగా .. ఒక రాష్ట్ర డీజీపీ , సీనియర్ ఐఏఎస్ ల పైనే తన బూతు పురాణం విప్పాడు.. ఇప్పుడు కేసుల్లో చిక్కుకున్నాడు .. అతని మీద నమోదైన సెక్షన్లు నాన్ బెయిలబుల్.. ఈ కేసుని తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్‌గా తీసుకుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి