ఖ‌మ్మం ప్ర‌భుత్వాసుప‌త్రి సిబ్బంది రెమ్‌డెసివిర్ ఇంజెక్ష‌న్ల బ్లాక్ దందా.. ప‌క్కా ప్లాన్‌తో ప‌ట్టుకున్న టాస్క్ ఫోర్స్‌..

Remdesivir Injection: ఓవైపు కరోనా ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చ‌ల‌గాట‌మాడుతుంటే దాన్ని కొంద‌రు ఆసరాగా తీసుకొని అక్ర‌మ దందాల‌కు పాల్ప‌డుతున్నారు. మ‌రీ ముఖ్యంగా క‌రోనా చికిత్స‌లో...

ఖ‌మ్మం ప్ర‌భుత్వాసుప‌త్రి సిబ్బంది రెమ్‌డెసివిర్ ఇంజెక్ష‌న్ల బ్లాక్ దందా.. ప‌క్కా ప్లాన్‌తో ప‌ట్టుకున్న టాస్క్ ఫోర్స్‌..
Remdesivir Injection
Follow us

|

Updated on: May 05, 2021 | 11:07 PM

Remdesivir Injection: ఓవైపు కరోనా ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చ‌ల‌గాట‌మాడుతుంటే దాన్ని కొంద‌రు ఆసరాగా తీసుకొని అక్ర‌మ దందాల‌కు పాల్ప‌డుతున్నారు. మ‌రీ ముఖ్యంగా క‌రోనా చికిత్స‌లో భాగంగా ఉప‌యోగిస్తున్న రెమ్‌డెసివిర్ ఇంజెక్ష‌న్ల బ్లాక్ దందా ఇటీవ‌ల బాగా పెరిగిపోయింది. కొంద‌రు ఆసుప‌త్రి సిబ్బందే స్వ‌యంగా ఈ దందాకు దిగుతుండ‌డం గ‌మ‌నార్హం. తాజాగా ఇలాంటి సంఘ‌ట‌న ఖ‌మ్మం ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చోటు చేసుకుంది. రెమ్‌డెసివిర్ ఇంజెక్ష‌న్ల‌ను బ్లాక్‌లో విక్ర‌యిస్తున్న ఆసుప‌త్రి సిబ్బందిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధ‌వారం ప‌ట్టుకున్నారు.. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ రామానుజం ఆధ్వ‌ర్యంలో సీఐ వేణు మాధవ్ , ఎస్సై సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఖ‌మ్మం ప్ర‌భుత్వాసుప‌త్రి స‌మీపంలో నిఘా పెట్టి ఇంజెక్ష‌న్ల‌ను అక్ర‌మంగా విక్ర‌యిస్తున్న వారిని ప‌ట్టుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. ఖ‌మ్మం ప్ర‌భుత్వాసుప‌త్రిలో రోగుల‌కు ఉప‌యోగించాల్సిన ఆరు రెమ్‌డెసివిర్ ఇంజెక్ష‌న్ల‌ను ప్ర‌భుత్వాసుప‌త్రిలోని స్టాఫ్ న‌ర్స్‌తో పాటు మ‌రో ఇద్ద‌రు ఔట్ సోర్స్ ఉద్యోగులు బ్లాక్ మార్కెట్లో ఒక్కో ఇంజెక్ష‌న్‌ను రూ. 38 వేల‌కు విక్ర‌యించ‌డానికి ప్ర‌య‌త్నించారు. ఈ స‌మ‌యంలోనే టాస్క్‌ఫోర్స్ పోలీసులు అకస్మాత్తుగా దాడి చేసి ప‌ట్టుకున్నారు. అనంత‌రం చట్టపరమైన చర్యల్లో భాగంగా ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ తెలిపారు.

Also Read: సిటి స్కాన్ పై ఎయిమ్స్ డైరెక్టర్ వ్యాఖ్యలు సరికావు, ఇండియన్ రేడియాలజీ సంస్థ ఖండన

Viral: బావిలో తేలుతున్న చిరుతపులి శవం.. దృశ్యాన్ని చూస్తే కన్నీళ్లు ఆగవు.! ఏం జరిగిందంటే.

అధికారుల నిర్లక్ష్యం వల్లే కరోనా ఉధృతి.. అంతర్జాతీయ సాయంపై కేంద్రాన్ని నిలదీసిన మజ్లిస్ అధినేత ఓవైసీ