సిటి స్కాన్ పై ఎయిమ్స్ డైరెక్టర్ వ్యాఖ్యలు సరికావు, ఇండియన్ రేడియాలజీ సంస్థ ఖండన

సిటి స్కాన్ పై ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చేసిన వ్యాఖ్యలు సరికావని చెన్నైలోని ఇండియన్ రేడియాలజికల్ ఇమేజింగ్ అసోసియేషన్ ఖండించింది.

  • Publish Date - 10:37 pm, Wed, 5 May 21 Edited By: Phani CH
సిటి స్కాన్ పై ఎయిమ్స్ డైరెక్టర్ వ్యాఖ్యలు సరికావు, ఇండియన్ రేడియాలజీ సంస్థ ఖండన
Guleria

సిటి స్కాన్ పై ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చేసిన వ్యాఖ్యలు సరికావని చెన్నైలోని ఇండియన్ రేడియాలజికల్ ఇమేజింగ్ అసోసియేషన్ ఖండించింది. ఈ టెస్టులు హానికరం కావని స్పష్టం చేసింది. ఈ పరీక్షలు 300 నుంచి 400 ఎక్స్ రేలకు సమానమని, ముఖ్యంగా యూత్ కి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయని గులేరియా అన్నారు.

అయితే ఇది తప్పని, కాలం చెల్లిన అభిప్రాయమని ఈ సంస్థ పేర్కొంది. ఇది సుమారు 30-40 ఏళ్ళ కిందటి ఉద్దేశమని ఈ సంస్థ అధ్యక్షుడు ప్రొఫెసర్ అమర్ నాథ్ అన్నారు. సిటి స్కానర్ల రేడియేషన్ కేవలం 5 నుంచి 10 ఎక్స్ రేలకు సమానమని ఆయన చెప్పారు. ప్రతి కోవిద్ రోగి ఈ సిటి స్కాన్ లకు వెళ్లాల్సిన అవసరం లేదని గులేరియా చెప్పడంఅర్థ రహితమని ఆయన వ్యాఖ్యానించారు.

దీని బదులు ఎక్స్ రే లకు వెళ్లాలని ఆయన అన్నారని, కానీ సిటి పరీక్షలు హానికరం కావన్నారు. అసలు ఈ పరీక్షల వల్ల అసలు లక్షణాలను డయాగ్నైజ్ చేయవచ్చునని ఆయన చెప్పారు. స్వల్ప లక్షణాలున్నవారు సూపర్ స్ప్రెడర్లు కాకుండా నివారించవచ్చునన్నారు. గులేరియా వ్యాఖ్యలుబాధ్యతా రాహిత్యమని, శాస్త్రీయం కావని ఆయన అన్నారు. ఏ విషయమైనా చెప్పేముందు నేటి సైన్స్ కు సంబంధించిన అంశాలను కూడా మదింపు చేయాలని ఆయన సూచించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: కరోనా నుంచి కోలుకున్నాక మళ్లీ ఎన్ని రోజులకు కొవిడ్ సోకుతుంది..! తెలిస్తే షాక్ అవుతారు..?

మళ్ళీ కోవిడ్ విజృంభణ, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో పెరిగిన కేసులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన