మళ్ళీ కోవిడ్ విజృంభణ, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో పెరిగిన కేసులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన

దేశంలో కొన్ని చోట్ల మళ్ళీ కోవిడ్ విజృంభించింది. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో ఒక్కసారిగా కేసులు పెరిగాయి. మహారాష్ట్రలో బుధవారం 57,640 కేసులు నమోదు కాగా..

మళ్ళీ కోవిడ్ విజృంభణ, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో పెరిగిన కేసులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన
Again Covid Cases Rise In Some States In India
Follow us

| Edited By: Phani CH

Updated on: May 05, 2021 | 10:02 PM

దేశంలో కొన్ని చోట్ల మళ్ళీ కోవిడ్ విజృంభించింది. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో ఒక్కసారిగా కేసులు పెరిగాయి. మహారాష్ట్రలో బుధవారం 57,640 కేసులు నమోదు కాగా..920 మంది రోగులు మరణించారు. 57 వేలమందికి పైగా డిశ్చార్జ్ అయ్యారు. కర్నాటక లో గత 24 గంటల్లో 50 వేల కేసులు నమోదయ్యాయి. ఒక్క బెంగుళూరు నగరంలోనే 23 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని, 346 మంది రోగులు మరణించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.పాజిటివిటీ రేటు 32 శాతానికి పెరిగింది. శాంపిల్స్ టెస్ట్ చేయగా ప్రతి మూడో వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ ఉందని తేలింది. కాగా ప్రపంచ కోవిడ్ కేసుల్లో 50 శాతంఇండియాలోనే ఉన్నాయని, 25 శాతం మరణాలు సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది., గతవారం రోజుల్లో ఇండియాలోని పరిస్థితి ఇది ఈ సంస్థ తన రిపోర్టులో పేర్కొంది. భారత్ లోని కోవిడ్ పరిస్థితిపై ఇటీవలి కాలంలో ఈ సంస్థ ఈ ప్రకటన చేయడం ఇదే మొదటిసారి. ఇండియాలో బుధవారం 3 లక్షల 82 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. వరుసగా 14 వ రోజు కూడా ఇన్ని లక్షలకు పైగా కేసులు రిజిస్టర్ అయ్యాయని తెలిపింది. హాట్ స్పాట్ లుగా మరీనా రాష్ట్రాలలో కఠిన లాక్ డౌన్ విధించాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయా రాష్ట్రాలకే నిర్ణయాన్ని వదిలివేసినప్పటికీ మహారాష్ట్ర, కర్ణాటక వంట రాష్ట్రాల్లోని పరిస్థితి తీవ్రతను కేంద్రం గుర్తించింది.

మరిన్ని ఇక్కడ చూడండి: TSRTC: ఆంధ్ర వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్.. ఏపీకి బస్సులు నిలిపేసిన టీఎస్ ఆర్టీసీ.. అక్కడి వరకే పరిమితం..!

Viral Video: వామ్మో.. సైకిల్‌పై స్టంట్ చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం.. వీడియో వైరల్