Earthquake: అస్సాంలో మరోసారి భూకంపం.. భయంతో పరుగులు పెట్టిన జనం.. రిక్టర్ స్కేల్‌పై 3.5 తీవ్రత నమోదు
అస్సాం రాష్ట్రం మరోసారి భూకంపంతో వణికిపోయింది. వరుస భూకంపాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
అస్సాం రాష్ట్రం మరోసారి భూకంపంతో వణికిపోయింది. వరుస భూకంపాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బుధవారం సాయంత్రం 7 గంటల 22 నిమిషాల సమయంలో తేజ్‌పూర్‌కు దక్షిణంగా భూప్రకంనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై ప్రకంపనల తీవ్రత 3.5గా నమోదైంది. 27 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నిక్షిప్తమై ఉన్నట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం అధికారులు వెల్లడించారు.
గత సోమవారం ఈ నెల 3న సైతం అస్సాంలోని సోనిత్‌పూర్‌లో భూప్రకంనలు చోటు చేసుకున్నాయి.. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.7గా నమోదైంది. అస్సాంలో ఇప్పటివరకు వరుసగా 7 సార్లు భూమి కంపించింది. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కాగా, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ అస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదని నేషనల్ సెంటర్ ఆఫ్ సీస్మోలజీ అధికారులు తెలిపారు. ఈశాన్య భారతంలో తరుచు ఇలాంటి ప్రకంపనలు రావడం సహజమని, ప్రజలు ఎవరు ఆందోళనకు గురికావల్సిని పనిలేదని అధికారులు చెబుతున్నారు.
Earthquake of magnitude 3.5 on the Richter scale hit Sonitpur in Assam at 7:22 pm today: National Center for Seismology
— ANI (@ANI) May 5, 2021
ఓవైపు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. మరోవైపు వరుస భూకంపాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రతిరోజూ సుమారు 5,000 తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి.