Sauropod Dinosaur: 10 కోట్ల ఏళ్లనాటి సారోపాడ్ డైనోసార్ ఎముకలు లభ్యం.. మేఘాలయలో కొనసాగుతున్న అణ్వేషణ..
GSI - Meghalaya: పురాతాన కాలంలోని పలు జీవుల రహస్యాల కోసం పురావస్తు శాస్త్రవేత్తలు నిత్యం అణ్యేషణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో
GSI – Meghalaya: పురాతాన కాలంలోని పలు జీవుల రహస్యాల కోసం పురావస్తు శాస్త్రవేత్తలు నిత్యం అణ్యేషణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మేఘాలయలోని పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లాలో సారోపాడ్ డైనోసార్‌కు చెందిన ఎముకలు లభ్యమయ్యాయి. ఈ సారోపాడ్ డైనోసార్ 10కోట్ల సంవత్సరాలకు సంబంధించినదని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించింది. గడచిన రెండేళ్లుగా పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లాలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పరిశోధకులు తవ్వకాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఎముకలు వెలుగుచూసినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ మేరకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పాలియోంటాలజీ విభాగానికి చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల కాలంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మేఘాలయను, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడులో పూర్వానికి చెందిన శిలాజాలను కనుగొన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. కాగా ఈ అణ్వేషణలో 20 జాతుల డైనోసార్‌లను భారతదేశంలో కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. అయితే సారోపాడ్ డైనోసార్ ప్రత్యేకమైనదని పరిశోధకులు వెల్లడించారు. ఇంకా పూర్వ జీవుల రహస్యం కోసం తవ్వకాలను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
కాగా.. ఇప్పటికే పురావస్తు శాస్త్రవేత్తలు పలు ప్రాంతాల్లో తవ్వకాలను చేపడుతున్నారు. పురాతన కాలానికి చెందిన ఆనవాళ్లను గుర్తించేందుకు ఈ పరిశోధనలు చేస్తున్నారు. దీనిలో భాగంగా మేఘాలయలో రెండేళ్ల పైనుంచి పరిశోధనలు చేస్తున్నారు.
Also Read: