Viral: బావిలో తేలుతున్న చిరుతపులి శవం.. దృశ్యాన్ని చూస్తే కన్నీళ్లు ఆగవు.! ఏం జరిగిందంటే.

Dead Body Of Leopard: సోషల్ మీడియాలో జంతువులు, పక్షులకు సంబంధించి అనేక వీడియోలు మనల్ని ఎప్పటికప్పుడు..

Viral: బావిలో తేలుతున్న చిరుతపులి శవం.. దృశ్యాన్ని చూస్తే కన్నీళ్లు ఆగవు.! ఏం జరిగిందంటే.
Dead Leopard
Follow us
Ravi Kiran

|

Updated on: May 05, 2021 | 10:35 PM

Dead Body Of Leopard: సోషల్ మీడియాలో జంతువులు, పక్షులకు సంబంధించి అనేక వీడియోలు మనల్ని ఎప్పటికప్పుడు అలరిస్తుంటాయి. వాటిల్లో కొన్నింటిని చూసినప్పుడు మనకు కన్నీళ్లు ఆగవు. ఆ కోవకు చెందిన ఓ ఫోటో తాజాగా వైరల్ అవుతోంది. అందులో చిరుతపులి శవాన్ని చూసి నెటిజన్లకు కన్నీళ్లు ఆగట్లేదు.

ఈ వైరల్ ఫోటోలో చిరుతపులి శరీరం బావిలో తేలుతూ కనిపిస్తుంది. అది కూడా ప్లాస్టిక్ కవర్ లోపల ఉండటం మరింత బాధను కలగజేస్తుంది. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దురదృష్టవశాత్తూ చిరుతపులి బావిలో పడిపోయి ప్లాస్టిక్ సంచిలో చిక్కుకుని ఊపిరాడక చనిపోయింది. బహిరంగ బావుల్లో ఇలా వ్యర్థాల కారణంగా, భారతదేశంలో వన్యప్రాణుల ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. దీనిపై నెటిజన్లు కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు.