CDFD Hyderabad Recruitment 2021: హైదరాబాద్ సీడీఎఫ్‌డీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. ఇంటర్వూ ఆధారంగా ఎంపిక..
CDFD Hyderabad Recruitment 2021: హైదరాబాద్‌లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ (సీడీఎఫ్‌డీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ ఉద్యోగాలను..
CDFD Hyderabad Recruitment 2021: హైదరాబాద్‌లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ (సీడీఎఫ్‌డీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. ఇందులో భాగంగా కన్సల్టెంట్ (రీసెర్చ్ మేనేజ్‌మెంట్), కన్సల్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్), సైకాలజిస్ట్, హిందీ ట్రాన్స్‌లేటర్, కన్సల్టెంట్ లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పైన తెలిపిన ఒక్కో పోస్టుకు నోటిఫికేషన్ జారీ చేశారు.
ముఖ్యమైన విషయాలు..
* కన్సల్టెంట్(రీసెర్చ్ మేనేజ్‌మెంట్) పోస్టుకు అప్లై చేసుకునే వారు పీహెచ్‌డీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత రంగంలో మూడేళ్లు అనుభవం ఉండాలి. వయసు 50 ఏళ్లు మించకూడదు.
* కన్సల్టెంట్(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు కామర్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో 5 ఏళ్లు అనుభవం ఉండాలి. వయసు 64 ఏళ్లు మించకూడదు.
* సైకాలజిస్ట్ పో్స్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంఫిల్/పీహెచ్‌డీలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇక సంబంధిత రంగంలో 4 ఏళ్లు అనుభవం కలిగిఉండాలి. వయసు 50 ఏళ్లు మించకూడదు.
* హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుకు అర్హతగా హిందీ సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలనే నిబంధన పెట్టారు. దీంతో పాటు డిప్లొమాలో ట్రాన్స్‌లేషన్ పూర్తిచేసి ఉండాలి. వయసు 62 ఏళ్లు మించకూడదు.
* కన్సల్టెంట్ లైబ్రేరియన్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు లైబ్రరీ సైన్సెస్‌లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 62 ఏళ్లు మించకూడదు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసకున్న అభ్యర్థులను ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* అర్హత, అనుభవం కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులకు చివరితేదీగా ఈ నెల 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు http://www.cdfd.org.in వెబ్‌సైట్‌ను చూడండి.
Also Read: కరోనా నుంచి కోలుకున్నాక మళ్లీ ఎన్ని రోజులకు కొవిడ్ సోకుతుంది..! తెలిస్తే షాక్ అవుతారు..?
CDAC Recruitment 2021: హైదరాబాద్ సీ-డ్యాక్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరితేది ఎప్పుడంటే..