Karimnagar: కూరగాయాలు, పప్పుదినుసుల సాగు బంద్.. హడలిపోతున్న రైతులు.. కారణం ఏంటంటే..

Karimnagar, July 18: అడవిలో ఉండాల్సిన కోతులు.. జనంలోకి వస్తున్నాయి.. మరి జనావాసాల్లోకి వచ్చిన కోతులుకు ఊరుకుంటేనా? జనంలోనే తిష్ట వేసి చుక్కలు చూపిస్తున్నాయి. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇక ఇలా ఊర్లలోకి వచ్చిన కోతులు..

Karimnagar: కూరగాయాలు, పప్పుదినుసుల సాగు బంద్.. హడలిపోతున్న రైతులు.. కారణం ఏంటంటే..
Monkeys
Follow us
G Sampath Kumar

| Edited By: Shiva Prajapati

Updated on: Jul 18, 2023 | 1:39 PM

Karimnagar, July 18: అడవిలో ఉండాల్సిన కోతులు.. జనంలోకి వస్తున్నాయి.. మరి జనావాసాల్లోకి వచ్చిన కోతులుకు ఊరుకుంటేనా? జనంలోనే తిష్ట వేసి చుక్కలు చూపిస్తున్నాయి. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇక ఇలా ఊర్లలోకి వచ్చిన కోతులు.. క్రమంగా సంతానాన్ని పెంచుకుంటున్నాయి. వీటి సంఖ్య ఈ ఐదేళ్లలోనే గణనీయంగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా గుంపులు.. గుంపులుగా తిరుగుతున్నాయి. ఆహారం కోసం మనుషులపైనే దాడులు చేస్తున్నాయి. ఎవరైనా బెదిరించే ప్రయత్నం చేస్తే.. వారికి ఇక మూడినట్లే. మూకుమ్మడిగా దాడి చేసి గాయపరుస్తున్నాయి. ఇంకా విశేషం ఏంటంటే.. కొన్ని గ్రామాల్లో మనుషుల కంటే.. కోతుల జనాభానే ఎక్కువగా ఉంది. ఒంటరిగా వెళ్తే చాలు.. వెంటపడి కరుస్తున్నాయి. కోతి కాటు బాధితులు కూడా పెరుగుతున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.. ఎటు చూసిన ఎత్తైన కొండలు, గుట్టలు, దట్టమైన అటవీ ప్రాంతాలు ఉండేవి. అయితే, అభివృద్ధి పనుల కోసం వాటిని ధ్వంసం చేయడంతో.. అడవుల్లో ఉండాల్సిన కోతులు ఇప్పుడు పట్టణాలు, పల్లెల్లోకి వచ్చి చేరుతున్నాయి. ఆహారం కోసం మనుషులపై యుద్ధం చేస్తున్నాయి. కడుపు నింపుకోవడానికి దాడులు చేస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెజారిటి గ్రామాలు కోతులతో ప్రభావితమవుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ తిష్ట వేస్తున్నాయి. కరీంనగర్ శివారులో కూడా కోతులు వీరంగం సృష్టిస్తున్నాయి. కోతులను పట్టేందుకు కరీంనగర్ కార్పొరేషన్.. ఒక్కో కోతికి 600 రూపాయల బడ్జెట్ కూడా కేటాయించింది. దీన్నిబట్టి కోతుల బెడద ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు, గ్రామ జనాభా కంటే.. కోతుల జనాభా అధికంగా ఉంది. తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి, పర్లపల్లి, మొగలి పాలెం.. మానకొండూరు మండలం చెంజర్ల, ఈదులగట్టేపల్లి, హజూరాబాద్ మండలం, శంకరపట్నం మండలం, తదిదర మండలాల్లో కోతుల బెడద విపరీతంగా పెరిగిపోయింది.

గ్రానైట్ తవ్వకాల కారణంగా, కొండలు, కోనలు అంతరించిపోతున్నాయి. అక్కడ ఉండాల్సిన కోతులన్నీ.. గ్రామాలకు వచ్చి చేరిపోతున్నాయి. కొన్ని గ్రామాల్లో 24 గంటల పాటు తలుపులు మూసివేయాల్సిందే. ఏ చిన్న అవకాశం లభించినా నేరుగా ఇళ్లలోకి దూరుతున్నాయి. విద్యార్థులను భయపెట్టి్స్తుతున్నాయి. కిరాణ షాపుల యజమానులు తమ దుకాణాలకు జాలీలు ఏర్పాటు చేసి కోతుల రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. కిరాణ షాపులోకి వెళ్లి.. తినుబండరాలను ఎత్తుకెళ్తున్నాయి. ఎవరైనా వినియోగదారులు కొనుగోలు చేయడానికి వస్తే చేతిలో నుంచి లాక్కొని వెళ్తున్నాయి. అంతేకాదు.. చిన్నారులపై దాడులు చేస్తున్నాయి. ధర్మపురిలో కోతుల భయానికి, ఓ మహిళ బిల్డింగ్‌పై నుంచి పడి చనిపోయింది. సంక్రాంతి పండుగ పూట ఈ కుటుంబంలో విషాదం నింపింది.

ఇవి కూడా చదవండి

చిన్నారులు ఒంటరిగా వెళ్లాలంటే భయపడుతున్నారు. వారిపైనా కోతులు దాడులు చేస్తున్నాయి. పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయాలంటే భయపడుతున్నారు. బాక్స్ లు ఎత్తుకెళ్తున్నాయి. ఒంటరిగా బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు స్థానికులు. ఈ రెండేళ్లలో ఈ సంఖ్య మరింత పెరిగిపోయింది. ఇతర పంటలు సాగు చేస్తే కోతులు తినేస్తున్నాయి. దీంతో.. పప్పుదినుసులు, కూరగాయాలు, ఇతర పంటలు సాగు చేయడం లేదు. వరిధాన్యం కొనుగోలు చేసినా, చేయకున్నా దీనినే సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. కూరగాయాల సాగు చేయాలంటే భయపడుతున్నారు. కూరగాయలు తినేస్తున్నాయి. కోతుల సమస్యతో చాలా మంది సతమతమవుతున్నారు. ఇటు వ్యవసాయం చేసుకోలేకపోతున్నారు. అటు ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. చిన్నారులు పాఠశాలకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. గతంలో కొన్ని గ్రామాల్లో కొండముచ్చులతో.. కోతులను భయ పెట్టించారు. కానీ, ఇప్పుడవి కొండ ముచ్చులను చూసి కూడా బయపడటం లేదు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..