Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telanagana: నా చావుకు ఆ నలుగురే కారణం.. కామరెడ్డిలో కలకలం రేపుతున్న సూసైడ్ నోట్ , సెల్పీ విడియో

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయిపల్లి మాజీ సర్పంచ్ సత్య గౌడ్ అదృశ్యం కలకలం రేపుతోంది. తన చావుకు ఆ నలుగురే కారణం అంటూ తీసిన సెల్ఫీ వీడియోతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.

Telanagana: నా చావుకు ఆ నలుగురే కారణం.. కామరెడ్డిలో కలకలం రేపుతున్న సూసైడ్ నోట్ , సెల్పీ విడియో
Man
Follow us
Prabhakar M

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 18, 2023 | 2:50 PM

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయిపల్లి మాజీ సర్పంచ్ సత్య గౌడ్ అదృశ్యం కలకలం రేపుతోంది. తన చావుకు ఆ నలుగురే కారణం అంటూ తీసిన సెల్ఫీ వీడియోతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. అదృశ్యమైన సత్య గౌడ్.. గ్రామ సర్పంచ్ భర్త అధికం నర్సాగౌడ్ అనుమానాస్పద మృతి కేసులో అరెస్టై ఇటీవల బెయిలుపై బయటకు వచ్చాడు. తాను గ్రామంలో సిసిరోడ్డు పనులు చేశానని, దాని బిల్లుకు సంబంధించిన చెక్కు వచ్చినా పని చేసినట్టు రుజువు ఏంటి అని ఎంపీఓ సరితా చెక్కు ఇవ్వలేదన్నారు. చెక్కు తనకు రాకుండా గ్రామానికి చెందిన అధికం రాజేందర్ గౌడ్, తోట భూమయ్య, గొల్ల అంజయ్య, ఇసాయిపేట సర్పంచ్ బాలాగౌడ్ కలిసి చెక్కును అధికం నిఖిల్ గౌడ్ రాసుకున్నారని సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.

ఎమ్మెల్యే గంప గోవ‌ర్ధన్ సైతం తాను చేసిన పనికి సర్పంచ్ వాళ్లనే డబ్బులు డ్రా చేసుకొమ్మని చెప్పారని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ఇప్పటికే అప్పుల బాధ తాళలేక అర ఎకరం భూమి అమ్ముకున్నానని, ఇప్పుడు డబ్బులు రాకుండా అడ్డుకోవడంతో మనోవేదనకు గురై సూసైడ్ చేసుకుంటానని పేర్కొన్నాడు. తన చావుకు ఆ నలుగురే కారణమని సెల్ఫీ వీడియో తీసుకుని, మొబైల్ ఫోన్, బైకు ఇంటివద్దనే ఉంచి ఆదివారం ఇంటినుంచి వెళ్లిపోయాడని సత్య గౌడ్ కుటుంబ సభ్యులు తెలిపారు. బెయిలుపై వచ్చిన నుంచి కామారెడ్డిలోని రాజీవ్ నగర్ కాలనీలో ఉంటున్నామని తెలిపారు. సత్య గౌడ్ భార్య లింగమణి కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో సత్యాగౌడ్ అదృశ్యం అయినట్టు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కామారెడ్డి పట్టణ సీఐ నరేష్ తెలిపారు.

ఇవి కూడా చదవండి
Suicide Note

Suicide Note