KA Paul: ఇదిగో ప్రూఫ్.. మునుగోడు ఎన్నిక రద్దు ఖాయం.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు..

మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటిస్తానని.. అందరితో మాట్లాడతానని కేఏ పాల్ తెలిపారు. ఎలాగైనా సరే మళ్లీ ఉపఎన్నికను నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు. తన దగ్గర ఫ్రూప్స్ ఉన్నాయని.. మళ్లీ ఎన్నిక ఖాయమంటూ తెలిపారు.

KA Paul: ఇదిగో ప్రూఫ్.. మునుగోడు ఎన్నిక రద్దు ఖాయం.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు..
Ka Paul
Follow us

|

Updated on: Nov 07, 2022 | 8:35 PM

తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నిక పర్వంలో ఎన్నో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం తమదైన రీతిలో ప్రచారం నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక.. కేఏ పాల్ మాత్రం.. ఈ ఉప ఎన్నికకు సెంటర్‌ ఆఫ్‌ది బైపోల్‌గా నిలిచారు. తన వినూత్న ప్రచారంతో ప్రజలను విశేషంగా అట్రాక్ట్ చేశారు. రోజుకో వేశధారణతో తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. డ్యాన్స్‌ నుంచి పొలంలో పనులు చేస్తూ, ఇంకా గొర్రెల కాపరిగా ఇలా ఎన్నో పాత్రలు వేస్తూ నానా హంగామా చేశారు. ఇలా ఎన్నో వింతలు, విచిత్రాలతో కేఏ పాల్ ప్రచారం చేసి ముగుగోడు ఉప ఎన్నికను మరింత క్రేజీగా మార్చారు. ఇంకా తన గెలుపు ఖాయమంటూ మెజార్టీని సైతం ప్రకటించారు. బైపోల్ కౌంటింగ్ రోజు ఏకంగా లక్షా పదివేల మెజార్టీతో గెలుస్తానంటూ ధీమా సైతం వ్యక్తంచేశారు. విజయోత్సవ ర్యాలీకి అనుమతి ఇవ్వాలంటూ ఏకంగా అధికారులనే కోరారు. ఏదిఏమైనా పాల్ లేకుండా ఉప ఎన్నికను మాత్రం ఊహించుకోలేం.. అన్నట్లు చేశారు. కానీ పాల్ అనుకున్నంత రీతిలో సత్తా చాటలేకపోయారు.

కానీ.. పాల్ అంచనా మాత్రం తలకిందులైంది. ఆయనకు కేవలం 805 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయినా.. కేఏ పాల్ మాత్రం తగ్గలేదు. ఎన్నికలో అన్యాయం జరిగిందని.. తాను మునుగోడులోనే ఉంటానంటూ పేర్కొన్నారు. దీనిపై హోంమంత్రి అమిత్ షా, ఎన్నికల సంఘానికి లేఖ రాశానంటూ తెలిపారు. అంతేకాకుండా మునుగోడులోని తన పార్టీ ఆఫీస్‌లో ఓటర్లు, నాయకులతో మాట్లాడారు. నాకు ఓటు వేశారా..? అంటూ ఒక్కొక్కరితో సంభాషించారు. కొందరు తనకు ఓటేసినట్లు చెప్పారు. దీంతో చాలామంది తనకు ఓటు వేశారని.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. ఇక్కడ అన్యాయం జరిగిందని కేఏ పాల్ చెప్పారు. ఈ ఎలక్షన్ రద్దవుతుందని.. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక జరుతుందని తెలిపారు.

రేపు, అన్ని మండలాల్లో పర్యటిస్తానని.. అందరితో మాట్లాడతానని కేఏ పాల్ తెలిపారు. ఎలాగైనా సరే మళ్లీ ఉపఎన్నికను నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు. తన దగ్గర ఫ్రూప్స్ ఉన్నాయని.. మళ్లీ ఎన్నిక ఖాయమంటూ తెలిపారు. ఏదీఏమైనప్పటికీ.. మునుగోడు ఉప ఎన్నిక ముగిసినా.. కేఏ పాల్ జోష్ మాత్రం తగ్గలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?