AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BRS: గులాబీలో గుబులు రేపుతున్న నేతలు వర్సెస్ నేతలు.. బీఆర్ఎస్‌ ఆవిర్భావ వేడుకల్లో రచ్చ రచ్చ..

బీఆర్ఎస్‌ ఆవిర్భావ వేడుకల్లో కొన్ని చోట్ల విభేదాలు బయటపడ్డాయి. మరికొన్ని చోట్ల నేతల మధ్య పొరపచ్చాలు పొడచూపాయి. ఒక్క నియోజక వర్గమే అయినా, ఒకే ప్రాంతమే అయినా, కండువా ఒక్కటే అయినా ఎవరికి వారు యమునా తీరు అన్నట్లు వ్యవహరించారు కొందరు పింక్ నేతలు. పక్క పార్టీలను విమర్శించడం అటుంచి సొంత పార్టీ నేతలను టార్గెట్ చేశారు నాయకులు.

BRS: గులాబీలో గుబులు రేపుతున్న నేతలు వర్సెస్ నేతలు.. బీఆర్ఎస్‌ ఆవిర్భావ వేడుకల్లో రచ్చ రచ్చ..
Brs Party
Shaik Madar Saheb
|

Updated on: Apr 26, 2023 | 9:14 AM

Share

బీఆర్ఎస్‌ ఆవిర్భావ వేడుకల్లో కొన్ని చోట్ల విభేదాలు బయటపడ్డాయి. మరికొన్ని చోట్ల నేతల మధ్య పొరపచ్చాలు పొడచూపాయి. ఒక్క నియోజక వర్గమే అయినా, ఒకే ప్రాంతమే అయినా, కండువా ఒక్కటే అయినా ఎవరికి వారు యమునా తీరు అన్నట్లు వ్యవహరించారు కొందరు పింక్ నేతలు. పక్క పార్టీలను విమర్శించడం అటుంచి సొంత పార్టీ నేతలను టార్గెట్ చేశారు నాయకులు.

భద్రాద్రి కొత్తగూడెంలో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. మాజీ మంత్రి తుమ్మల సమక్షంలో నేతలకు వార్నింగ్ ఇచ్చారు. మణుగూరులో నిర్వహించిన వేడుకల్లో రేగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంచితనమే తనకు శాపంగా మారింది అంటూ కొందరు నాయకులు, కార్యకర్తల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. చాలా మంది ఎమ్మెల్యేలు కార్యకర్తలకు సాయం చేయరు, అది తనకు ప్రమాదంగా మారింది ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా పనులు చేసి పెడితే రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఇక నుంచి అలాంటి వారు తన దగ్గరకు రావాల్సిన అవసరం లేదంటూ కుండబద్దలు కొట్టారు రేగా. మా ఎమ్మెల్యే బాగా పనిచేస్తున్నారు కాని ఈసారి ఓడించాలి అని కొందరు మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఎక్కడ మాట్లాడుతున్నారో అన్నీ తనకు తెలుసు అంటూ కార్యకర్తలను ఆలోచనలో పడేశారు.. ఇలాంటి పిచ్చి చేష్టలు ఇకనైనా మానేయాలి అంటూ హెచ్చరించారు.

రేగా కాంతారావు పబ్లిక్‌గా చేసిన వ్యాఖ్యలు నియోజక వర్గంలో కలకలం రేపుతున్నాయి. ఇక నాగార్జునసాగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి వర్గాలుగా విడిపోయింది. హాలియాలో జరిగిన పార్టీ ప్లీనరీలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి వర్గానికి చెందిన నేతలెవరు హాజరు కాలేదు. కేవలం ఎమ్మెల్యే భగత్, ఆయన అనుచరులు, పార్టీ ప్రజాప్రతినిధులు మాత్రమే పాల్గొన్నారు. ఇదిలా ఉంటే నియోజకవర్గంలో ఉద్యమ నేతలంతా ప్రత్యేక సమావేశం నిర్వహించుకున్నారు. దీంతో పార్టీ కార్యకర్తలు అయోమయంలో పడ్డారు.

ఇవి కూడా చదవండి

ఇక వైరాలో రెండుగా విడిపోయింది బీఆర్ఎస్‌. ప్రతినిధుల సభకు మాజీ ఎమ్మెల్యే చంద్రవతి డుమ్మా కొట్టారు. తాను పార్టీ కోసం పనిచేస్తున్నాను, తన సేవలను అధినేత గుర్తిస్తారని ఆమె అన్నారు. వ్యక్తులు మారుతారు, పదవులు మారుతాయి. కాని పార్టీ, ప్రజలు శాశ్వతం అంటూ ఆమె ప్రకటించారు.

ఓవైపు తాతా మధు, నామా నాగేశ్వర్ రావు సభ, మరో వైపు చంద్రవతి ఆవిర్భావ వేడుకలు.. ఇలా వేరు వేరు ప్రోగ్రామ్స్‌తో నేతలు తమ మధ్య విభేదాలు బయటపడ్డాయి. మరో వైపు వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో బీఆర్ఎస్ నియోజక వర్గ ప్రతినిధుల సభలో MLA నరేందర్ రెడ్డి పాల్గొనగా.. మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, అతని అనుచరులు ప్రతినిధుల సభకు దూరంగా ఉన్నారు. ఇది పార్టీలో చర్చనీయ అంశంగా మారింది. కొందరు నేతల ఘాటు వ్యాఖ్యలు, మరికొన్ని చోట్ల వేరువేరు కార్యక్రమాలు కార్యకర్తలను అయోమయానికి గురిచేశాయి. అందరూ కలిసి జరుపుకోవాల్సిన పండుగను కొన్ని చోట్ల వివాదాలకు కేరాఫ్‌ మార్చారన్న చర్చ మొదలైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..