Hyderabad Metro: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రూట్లలో మెట్రో షార్ట్‌లూప్ ట్రిప్పులు..
గత కొద్దిరోజులుగా మెట్రో రైళ్లలో ప్రయాణీకుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఆ రద్దీని నియంత్రించేందుకు హైదరాబాద్ మెట్రో చర్యలకు సిద్దమైంది.
ఒకవైపు ఎండ.. మరోవైపు వర్షంతో సతమతమవుతున్న హైదరాబాదీలు తమ ప్రయాణాన్ని కూల్‌గా కొనసాగించాలని మెట్రోను ఆశ్రయిస్తున్నారు. దీంతో గత కొద్దిరోజులుగా మెట్రో రైళ్లలో ప్రయాణీకుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఆ రద్దీని నియంత్రించేందుకు హైదరాబాద్ మెట్రో చర్యలకు సిద్దమైంది. ఇందులో భాగంగానే ఉదయం, సాయంత్రం కీలక రూట్లలో షార్ట్‌లూప్ ట్రిప్పులను అందుబాటులో తెచ్చింది. ఈ షార్ట్‌లూప్ ట్రిప్పుల వల్ల ప్రయాణీకుల రద్దీ తగ్గడమే కాకుండా.. వారు రైళ్ల కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సిన అవసరం ఉండదని అధికారులు పేర్కొన్నారు.
షార్ట్‌లూప్ ట్రిప్పులు ఇలా..
ప్రయాణీకుల రద్దీ అనుగుణంగా అమీర్‌పేట్, సికింద్రాబాద్, మెట్టుగూడ మెట్రో స్టేషన్ల నుంచి షార్ట్ లూప్ ట్రిప్పులు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా రాయదుర్గం వెళ్లే రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉండటంతో.. అమీర్‌పేట్-రాయదుర్గం కారిడార్‌లో ఉదయం 11 నుంచి సాయత్రం 5 గంటల వరకు.. ప్రతీ 4.30 నిమిషాలకు ఒక ట్రైన్‌ను నడుపుతారు. అటు అన్ని ప్రధాన మెట్రో స్టేషన్లలోనూ భద్రతా సిబ్బందిని పెంచుతున్నట్లు మెట్రో సంస్థ పేర్కొంది.