AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చదువుకోమని చెప్పడమే పాపమైంది.. డిగ్రీ విద్యార్థిని చంపిన ఇంటర్ స్టూడెంట్స్.. రాత్రి నిద్రపోతుండగా..

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలోని బీసీ బాయ్స్ హాస్టల్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. చదువుకోవాలని సూచించిన డిగ్రీ విద్యార్థి వెంకట్‌ను ఆరుగురు ఇంటర్‌ విద్యార్థులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

చదువుకోమని చెప్పడమే పాపమైంది.. డిగ్రీ విద్యార్థిని చంపిన ఇంటర్ స్టూడెంట్స్.. రాత్రి నిద్రపోతుండగా..
Student Murder
Shaik Madar Saheb
|

Updated on: Mar 04, 2024 | 11:07 AM

Share

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలోని బీసీ బాయ్స్ హాస్టల్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. చదువుకోవాలని సూచించిన డిగ్రీ విద్యార్థి వెంకట్‌ను ఆరుగురు ఇంటర్‌ విద్యార్థులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి మండలం తిప్పరం తండాకు చెందిన డిగ్రీ విద్యార్థి వెంకట్ హరియల్ (19) బోధన్‌ పట్టణంలోని బీసీ వసతి గృహంలో స్టడీ అవర్‌ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నాడు. ఆదివారం రాత్రి పలువురు ఇంటర్‌ విద్యార్థులు చదువుకోకుండా మాట్లాడుకుంటుండటంతో వారిని వెంకట్ మందలించాడు..

ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయని.. మాట్లాడకుండా చదువుకోవాలంటూ వారికి సూచించాడు. ఇది నచ్చని ఆరుగురు ఇంటర్ విద్యార్థులు రాత్రి గదిలో నిద్ర పోతున్న వెంకట్‌పై దాడి చేశారు. అందరూ కలిసి వెంకట్ ను గొంతు నులిమి హత్య చేశారు.

హత్య అనంతరం ఆరుగురు విద్యార్థులు అక్కడినుంచి పారిపోయారు. గదిలో నుంచి శబ్దాలు రావడంతో వసతి గృహంలోని మిగతా విద్యార్థులు అక్కడికి వెళ్లి చూశారు. అపస్మారక స్థితిలో ఉన్న వెంకట్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వెంకట్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆరుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కాగా.. ఈ ఘటన అనంతరం తోటి విద్యార్థులే హత్యకు పాల్పడినట్లు మృతుని కుటుంబీకులు ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..