Indian Army Recruitment Rally: తెలంగాణ అభ్యర్థులకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. 8, 10, ఇంటర్ పాసైనవారు కూడా అర్హులే
ఆర్మీ యూనిఫామ్ వేసుకుని దేశసేవ చేయాలని కలలు కనే తెలంగాణ యువతకు గుడ్ న్యస్ వచ్చేసింది. సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాలయం హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌లో...
Indian Army Recruitment Rally in Telangana: ఆర్మీ యూనిఫామ్ వేసుకుని దేశసేవ చేయాలని కలలు కనే తెలంగాణ యువతకు గుడ్ న్యస్ వచ్చేసింది. సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాలయం హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌లో రాష్ట్రంలోని అభ్యర్థులకు నియామక ర్యాలీ నిర్వహిస్తోంది. తెలంగాణకు చెందిన 33 జిల్లాల వాళ్లు ఈ ర్యాలీలో పాల్గొనేందుకు అర్హులే. ఎనిమిదో తరగతి, టెన్త్ ఉత్తీర్ణతతో కూడా కొన్ని పోస్టులకు అర్హత సాధించవచ్చు. మరికొన్ని పోస్టులకు కనీసం 50% మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి. ఇంట్రస్ట్ ఉన్నవాళ్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 19 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్టవుతుంది. ఫిబ్రవరి 17 దరఖాస్తులకు చివరితేది. పూర్తి వివరాలకు http://joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
సోల్జర్ – టెక్నికల్, సోల్జర్ – టెక్నికల్ (ఏవియేషన్/ అమ్యూనిషన్ ఎగ్జామినర్), సోల్జర్ – టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ – జనరల్ డ్యూటీ, సోల్జర్ – ట్రడ్స్‌మెన్, సోల్జర్ – క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్ దరఖాస్తులు కోరుతున్నారు. ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, మెడికల్, ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. 2021 మార్చి 05 నుంచి మార్చి 24 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది.
Also Read :