వాటర్‌ట్యాంక్‌లో అస్థిపంజరాలు.. అవి పిల్లలవే అని స్థానికుల అనుమానం.. విచారించిన పోలీసులు ఏం తేల్చారంటే

పండుగ పూట ఆ ఊరిలో కలకలం చెలరేగింది. వినియోగంలో లేని ఓ వాటర్‌ ట్యాంక్‌లో రెండు అస్థి పంజరాలు కనిపించడంతో గ్రామస్థులు షాక్ తిన్నారు. జనగామ జిల్లా నర్మెటలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వాటర్‌ట్యాంక్‌లో అస్థిపంజరాలు.. అవి పిల్లలవే అని స్థానికుల అనుమానం.. విచారించిన పోలీసులు ఏం తేల్చారంటే
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 17, 2021 | 6:23 PM

పండుగ పూట ఆ ఊరిలో కలకలం చెలరేగింది. వినియోగంలో లేని ఓ వాటర్‌ ట్యాంక్‌లో రెండు అస్థి పంజరాలు కనిపించడంతో గ్రామస్థులు షాక్ తిన్నారు. జనగామ జిల్లా నర్మెటలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నర్మెట మండలకేంద్రం నుంచి జనగామ వెళ్లే రూట్‌లో ఉపాధి హామీ స్కీమ్ కింద ఓ వ్యవసాయ కేంద్రంలో గతంలో నర్సరీ ఏర్పాటు చేశారు. అయితే  కొన్నేళ్లుగా నర్సరీలో ఎటువంటి కార్యకలాపాలు జరగడం లేదు. ఈ క్రమంలో నర్సరీ అవసరాల కోసం ఏర్పాటు చేసిన వాటర్‌ ట్యాంక్‌ను నిరుపయోగంగా వదిలేశారు. శుక్రవారం కొందరు పిల్లలు గాలిపటాలు ఎగరేసుకుంటూ ట్యాంకు వైపు వెళ్లగా దుర్వాసన వచ్చింది. పరిశీలించగా రెండు అస్థి పంజరాలు ట్యాంక్‌లో కనిపించాయి. దీంతో పిల్లలు వెళ్లి ఊర్లోని పెద్దలకు విషయం చెప్పారు. వారు పోలీసులకు సమాచారం చేరవేశారు.

సీఐ రాపెల్లి సంతోష్‌కుమార్‌ వెళ్లి అస్థి పంజరాలను పరిశీలించారు. వాటర్‌ ట్యాంక్‌ చాలా ఎత్తులో ఉండటం వల్ల కోతులు ప్రమాదవశాత్తూ అందులో పడి చనిపోయి ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, ఇద్దరు చిన్నారులను చంపేసి అందులో పడేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల అనుమానాలతో అలర్టైన నర్మెట పోలీసులు వెటర్నరీ నిపుణులను తీసుకొచ్చి టెస్టులు చేయించారు. అవి కోతుల అస్థి పంజరాలే అని పరీక్షల అనంతరం వారు నిర్ధారించారు.

Also Read :  Ap Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 161 వైరస్ పాజిటివ్ కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా