AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Ration Card: ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదన్నదే సీఎం లక్ష్యం.. రేషన్ కార్డుల పంపిణీలో మంత్రి తలసాని..

Telangana Ration Card: తెలంగాణలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని...

Telangana Ration Card: ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదన్నదే సీఎం లక్ష్యం.. రేషన్ కార్డుల పంపిణీలో మంత్రి తలసాని..
Talasani Srinivas Yadav
Shiva Prajapati
|

Updated on: Jul 26, 2021 | 5:56 PM

Share

Telangana Ration Card: తెలంగాణలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం నాడు బేగంపేటలోని జురాస్టియన్ క్లబ్‌లో లబ్దిదారులకు తెల్లరేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. పేద ప్రజలకు నిత్యావసర సరుకులను సబ్సిడీపై అందించే తెల్లరేషన్ కార్డుల పంపిణీని రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ప్రస్తుతం 5,85,756 తెల్లరేషన్ కార్డ్లు ఉన్నాయని, కొత్తగా జారీ చేసిన వాటితో కలిపి 21,90,034 మంది లబ్ది పొందుతారని పేర్కొన్నారు. కాగా, హైదరాబాద్ జిల్లా పరిధిలో 56,064 మంది కొత్తగా తెల్ల రేషన్ కార్డును పొందారని మంత్రి తలసాని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారిని ఆగస్టు నెల నుంచే రేషన్ పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. కాగా, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎంఎల్‌సి సురభి వాణిదేవి, కాలేరు వెంకటేష్, సీఆర్ఓ బాల మాయాదేవి, డీఎస్ఓ రమేష్, ఆర్‌డివో వసంత, డిప్యూటీ మేయర్ శ్రీలత, కార్పొరేటర్‌లు, ఇతరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. కొత్త రేషన్ కార్డు లబ్దిదారులకు ఆగస్టు నెల నుంచే రేషన్‌ బియ్యం అందజేయాలని సీఎం ఆదేశించారు. నిజానికి జూన్ నెలలో కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన సమయంలో కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల సంఖ్య 4,46,169గా ఉండగా, వీటిని అన్ని దశల్లో పరిశీలన చేశారు. డూప్లికేట్‌లు లేకుండా, ప్రభుత్వం విధించిన నిబంధనలకు లోబడి అన్ని కోణాల నుంచి పరిశీలించారు. వివిధ అంశాల్లో పరిశీలించిన తర్వాత 3,09,083 మందిని అర్హులుగా గుర్తించారు. అధికంగా హైదరాబాద్‌లో 56,064 మందిని అర్హులుగా తేల్చగా, రంగారెడ్డిలో 35,488 మందిని, మేడ్చల్‌లో 30,055 మందిని అర్హులుగా గుర్తించారు.

Also read:

Illegal Affair: కొడలితో మామ అక్రమ సంబంధం.. కొడుకుకు తెలియడంతో.. ఆ తండ్రి ఏం చేశాడంటే..

AP Corona Cases: ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 1627 మందికి పాజిటివ్, 17మంది మృతి

‘మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయాల్సిందే ‘..కోవిడ్ డ్రగ్ వివాదంలో బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ పై ‘సుప్రీం ‘ వ్యాఖ్య !