‘మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయాల్సిందే ‘..కోవిడ్ డ్రగ్ వివాదంలో బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ పై ‘సుప్రీం ‘ వ్యాఖ్య !
దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో రాజకీయ నాయకులు మందులను తమ వద్ద నిల్వ ఉంచుకోవడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఫాబీ ఫ్లూ వంటి మందులను...
దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో రాజకీయ నాయకులు మందులను తమ వద్ద నిల్వ ఉంచుకోవడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఫాబీ ఫ్లూ వంటి మందులను అది కూడా తీవ్ర కొరత ఉన్నప్పుడు తన దగ్గర స్టోర్ చేసుకోవడం సముచితం కాదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆయనను ప్రాసిక్యూట్ చేయకుండా తాము అడ్డుకోలేమని న్యాయమూర్తులు జస్టిస్ డీ.వై. చంద్రచూడ్..జస్టిస్ షాలతో కూడిన బెంచ్ పేర్కొంది. అవసరమైతే మీరు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చునని సూచించింది. ఈ విషయంలో కోర్టు ఇంకా తన ఉత్తర్వులను ఇవ్వలేదని న్యాయమూర్తులు అన్నారు. మందుల కోసం రోగులు, వారి బంధువులు పరుగులు తీస్తున్నప్పుడు ఓ ట్రస్టు గానీ, కొంతమంది సభ్యులతో కూడిన గ్రూప్ గానీ వాటిని ప్రొక్యూర్ చేసి,వాటిని పంపిణీ చేయడాన్ని తాము అనుమతించబోమన్నారు. ఒక వ్యక్తి తనకు తానుగా మెడిసిన్స్ ని సప్లయ్ చేయజాలడని వారన్నారు. అలాంటప్పుడు ప్రతివారూ తమ సొంత ప్రయోజనాలకోసం ఇలా చేస్తారని బెంచ్ అభిప్రాయపడింది.
ఈ వ్యాఖ్యతో గౌతమ్ గంభీర్ తరఫు లాయర్ తన పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. తాను పెద్ద ఎత్తున ఈ మందులను సేకరించి నిల్వ చేసుకోవడంపై ఢిల్లీ హైకోర్టు అభ్యంతరం ప్రకటించడాన్ని సవాలు చేస్తూ గౌతమ్ గంభీర్ సుప్రీంకోర్టుకెక్కారు. పరిస్థితిని ఆసరాగా చేసుకుని మీరు గొప్ప ఆపద్భాంధవునిలా మందులను నిల్వ చేసుకున్నారని హైకోర్టు నాడు ఆయనను మందలించినంత పని చేసింది. అయితే తన నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా వీటిని పంపిణీ చేయదలుచుకున్నానని, ఇందులో తప్పేముందని గంభీర్ కోర్టుకు తెలిపారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆయననుప్రాసిక్యూట్ చేయాల్సిందేనని రూలింగ్ ఇచ్చింది.
మరిన్ని ఇక్కడ చూడండి : హోం మినిష్టర్ అయితే ఏంటి..?అంబులెన్సుకు దారివ్వాల్సిందే..!పోలీస్ రియాక్షన్(వీడియో):stopping ambulance video.