Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khammam: చనిపోతానంటూ వెళ్లిన భార్య.. కట్ చేస్తే.. బావిలో దూకిందేమోనని భర్త, అతని ఫ్రెండ్..

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అప్పలనర్సింహపురం గ్రామానికి చెందిన భర్త నాగరాజు, భార్య రమణమ్మకు మధ్య చిన్న ఘర్షణ జరిగింది.దీంతో రమణ బావిలో దూకి చనిపోతానంటూ ఇంటి నుంచి వెళ్లిపోయింది..దీంతో భర్త నాగరాజు తన స్నేహితుడైన జోజిని తీసుకుని సమీపంలోని వ్యవసాయ బావి దగ్గరకు వెళ్లాడు..

Khammam: చనిపోతానంటూ వెళ్లిన భార్య.. కట్ చేస్తే.. బావిలో దూకిందేమోనని భర్త, అతని ఫ్రెండ్..
Khammam News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 24, 2023 | 10:58 AM

భార్య భర్తల మధ్య జరిగిన చిన్న గొడవ.. ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. బావిలో భార్య దూకిందన్న అనుమానంతో భర్త.. అతని కోసం మరో వ్యక్తి.. ఇలా ఇద్దరూ నీటిలో మునిగి క్షణాల్లోనే మరణించారు. ఈ విషాద ఘటన తెలంగాణ ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అప్పలనర్సింహపురం గ్రామంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. భర్త నాగరాజు, భార్య రమణమ్మకు మధ్య ఆదివారం చిన్నపాటి ఘర్షణ జరిగింది. దీంతో రమణ బావిలో దూకి చనిపోతానంటూ భార్య రమణమ్మ వెళ్లిపోయింది. దీంతో భర్త నాగరాజు తన స్నేహితుడైన జోజిని తీసుకుని సమీపంలోని వ్యవసాయ బావిలో దూకిందేమోనన్న అనుమానంతో అక్కడకు వెళ్ళాడు.

బావిలోనే దూకిందన్న అనుమానంతో నాగరాజు.. ఈతరాక పోయిన బావిలో దూకాడు. నాగరాజుతో పాటు జోజి కూడా దూకడంతో.. ఇద్దరు బావిలో మునిగి మృతి చెందారు. గ్రామస్తులు వచ్చి రమణమ్మ సమీపంలోని పొలంలో ఉన్నట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను బయటకు తీసి పంచనామా నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అర్థరాత్రి కావడంతో చీకట్లో గుర్తించలేక ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు పేర్కొంటున్నారు. కాగా.. వీరిద్దరి మృతి.. గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..