Telangana: కాలేజీలో గంజాయి కలకలం.. మత్తులో తూగుతున్న స్టూడెంట్స్.. ఆరుగురిపై వేటు..

కాలేజీల్లో గంజాయి గుప్పు మంటోంది. మత్తుకు బానిసై ఆ వ్యసనంలో విద్యార్థులు దారి తప్పుతున్నారు. స్టూడెంట్స్ ను టార్గెట్ చేసుకుంటున్న ఏజెంట్లు వారికి సరకును అలవాటు చేస్తున్నారు. వారి నుంచి ఇతరులకు...

Telangana: కాలేజీలో గంజాయి కలకలం.. మత్తులో తూగుతున్న స్టూడెంట్స్.. ఆరుగురిపై వేటు..
Ganja In Bellampalli
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 02, 2022 | 6:55 PM

కాలేజీల్లో గంజాయి గుప్పు మంటోంది. మత్తుకు బానిసై ఆ వ్యసనంలో విద్యార్థులు దారి తప్పుతున్నారు. స్టూడెంట్స్ ను టార్గెట్ చేసుకుంటున్న ఏజెంట్లు వారికి సరకును అలవాటు చేస్తున్నారు. వారి నుంచి ఇతరులకు స్ప్రెడ్ చేస్తున్నారు. తాజాగా బెల్లంపల్లిలోని కాలేజీలో గంజాయి మత్తులో స్టూడెంట్స్ తూగుతూ కనిపించడం కలకలం రేపింది. మంచిర్యాల పట్టణ కేంద్రంగా గంజాయి సరఫరా యథేచ్ఛగా కొనసాగుతోంది. యువత బానిసై భవిష్యత్‌ను అంధకారం చేసుకుంటున్నారు. వారి బలహీనతలను ఆసరాగా చేసుకుంటున్న ఏజెంట్లు అందినకాడికి దోచుకుంటున్నారు. ఒకరి నుంచి మరొకరికి గంజాయి అలవాటు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ పదుల సంఖ్యలో గంజాయి అడ్డాలు ఏర్పాటైనట్లు పోలీసులు గుర్తించారు. వీటిని అరికట్టడంపై పోలీసులు దృష్టి సారించారు. అధికారుల కళ్లుగప్పుతున్న విక్రయ దారులు తమ లక్ష్యం చేధించేందుకు పలు మార్గాలను అన్వేషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే బెల్లంపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గంజాయి కలకలం రేపింది. గంజాయి మత్తులో ఆరుగురు సీనియర్ విద్యార్థులు తూగుతున్నట్టు సమాచారం అందింది. మూడు నెలలుగా గుట్టుగా ఈ వ్యవహారం సాగుతుతోందని తెలిసింది.

ఇందిరమ్మ కాలనీ నుంచి పాలిటెక్నిక్ కాలేజీలోకి గంజాయి చేరుతోందని సమాచారం. కాలేజీలో 20 మంది విద్యార్థులు గంజాయికి బానిసయ్యారు. ఆరుగురు విద్యార్థులను ప్రాథమికంగా గుర్తించి హాస్టల్ నుంచి ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి తొలగించారు. ఈ ఘటనపై విచారణ రహస్యంగా కొనసాగుతోంది. మంచిర్యాల నుంచి గంజాయి సరఫరా అవుతున్నట్టుగా ప్రిన్సిపాల్ గుర్తించారు. గంజాయికి బానిసైన విద్యార్థులకు అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం గంజాయిని నామరూపాలు లేకుండా చేయాలని ఆదేశించినప్పటికీ జిల్లాలో జోరుగా విక్రయాలు సాగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..