IMD alert: తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతోన్న వర్షాలు.. రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. రాజధాని నగరం హైదరాబాద్‌ తోపాటు తెలంగాణ తడిసి ముద్దవుతోంది. సాయంత్రం మొదలైన వాన.. అనేక ప్రాంతాల్లో నాన్‌స్టాప్‌గా..

IMD alert: తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతోన్న వర్షాలు.. రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి
Rains
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 13, 2021 | 7:51 AM

Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. రాజధాని నగరం హైదరాబాద్‌ తోపాటు తెలంగాణ తడిసి ముద్దవుతోంది. సాయంత్రం మొదలైన వాన.. అనేక ప్రాంతాల్లో నాన్‌స్టాప్‌గా కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలను వర్షపు నీరు ముంచెత్తింది. అటు.. ఏపీలోనూ ఇదే పరిస్థితి. గోదావరి జిల్లాలో రాత్రి మనుషులు కొట్టుకుపోయేంతలా ఈదురుగాలులు వీచాయి.

తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, ఏజెన్సీ ప్రాంతాల్లో జోరువాన కురిసింది. సామర్లకోటలో డ్రైనేజీలో కొట్టుకుపోయి ఒక వ్యక్తి మరణించాడు. పశ్చిమ గోదావరి జిల్లాపైనా వర్ష ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఏలూరులోని రోడ్లపై మోకాల్లోతు నీరు నిలిచింది. సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

కాగా, వాతావరణ శాఖ చెబుతోన్న సమాచారం ప్రకారం తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది.

దీని ప్రభావం వల్ల ఇవాళ కూడా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయి. నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో ఈ రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిరి, నాగర్ కర్నూల్ జిల్లాలో గంటకి 30 నుంచి 40కి.మీ వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ.

ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉంచారు.

Read also: Iraq: ఇరాక్‌లో ఘోర అగ్ని ప్రమాదం, ఆర్తనాదాలు.. కరోనా చికిత్స పొందుతోన్న 50 మంది అగ్నికి ఆహుతి.!

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.