Iraq: ఇరాక్‌లో ఘోర అగ్ని ప్రమాదం, ఆర్తనాదాలు.. కరోనా చికిత్స పొందుతోన్న 50 మంది అగ్నికి ఆహుతి.!

ఇరాక్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. తాజా సమాచారం మేరకు ఈ దుర్ఘటనలో 50 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది.

Iraq: ఇరాక్‌లో ఘోర అగ్ని ప్రమాదం, ఆర్తనాదాలు.. కరోనా చికిత్స పొందుతోన్న 50 మంది అగ్నికి ఆహుతి.!
Iraq Fire
Follow us

|

Updated on: Jul 13, 2021 | 6:34 AM

Covid Ward Fire: ఇరాక్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. తాజా సమాచారం మేరకు ఈ దుర్ఘటనలో 50 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. దక్షిణ ఇరాక్ నగరమైన నస్రియా లోని అల్‌ హుస్సేన్‌ ఆస్పత్రిలో చెలరేగిన మంటల వల్ల ఈ ఉపద్రవం సంభవించింది. ఈ ఘటనలో ఆస్పత్రిలోని కరోనా వార్డులో చికిత్స పొందుతున్న అనేక మంది అగ్నికి ఆహుతయ్యారు.

పలువురికి తీవ్రగాయాలు కావడంతో దగ్గర్లోని వేరే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొవిడ్ ఐసోలేషన్ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం నెలకొంది. బాధితులంతా కాలిన గాయాలతో మరణించారని, ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని స్థానిక ఆరోగ్య ప్రతినిధి హేదర్ అల్-జామిలి చెప్పారు.

ఇలా ఉండగా, భవనం లోపల చాలా మంది బాధితులు చిక్కుకు పోవడంతో ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో భీతావహంగా మారినట్టు సమాచారం. కాగా, ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మందిని రక్షించినట్లు ఇరాక్ వైద్య వర్గాలు వెల్లడించాయి.

Read also: Vellampalli: టీడీపీ ఐదేళ్ల పాలనలోని అవినీతి చిట్టా అంతా బయటకు తీస్తాం: మంత్రి వెల్లంపల్లి

Latest Articles