Telangana: ఇదేంట్రా బాబోయ్.. పైన చూస్తే అట్ట పెట్టెలు.. కానీ లోపల మాత్రం..
అదో జాతీయ రహదారి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అప్పుడప్పుడు పోలీసులు తనిఖీలు చేస్తుంటారు. అమానాస్పదంగా వెళ్తున్న వాహనాలపై ప్రధానంగా ఫోకస్ పెడుతుంటారు. తాజాగా అట్ట పెట్టెలతో వెళ్తున్న ఓ కంటైనర్‌పై వారి ఫోకస్ పడింది. ఆపి చెక్ చేయగా గుట్టు వీడింది.

హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ ప్రాంతంలో రాచకొండ పోలీసులు రొటీన్‌గా వాహనాల తనిఖీ చేస్తున్నారు. హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కంటైనర్‌ను పోలీసులు ఆపి తనిఖీ చేశారు. లోపల ఉన్నవి చూసి పోలీసులు కంగుతిన్నారు. పుష్ప సినిమాను తలదన్నేలా డీసీఎంలో ఆవులను అక్రమ రవాణా చేస్తున్నారు. కంటైనర్ కింది భాగంలో ఆవులను అత్యంత దారుణ స్థితిలో తరలిస్తున్నారు. బయటకు కనిపించే కంటైనర్ పై భాగంలో మాత్రం అట్ట పెట్టెలను అమర్చి.. ఆవులను కబేళాలకు కేటుగాళ్లు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
రాజమండ్రి, కోదాడల నుంచి అక్రమంగా హైదరాబాద్ కబేలాలకు ఆవులను తరలిస్తున్నారని బజరంగ్ దళ్ కార్యకర్తలు చౌటుప్పల్, రాచకొండ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హైదరాబాద్ వైపు వెళ్తున్న రెండు వాహనాలను తనిఖీ చేసి కబేలాలకు తరలిస్తున్న 43 గోవులను పట్టుకున్నారు. రెండు వాహనాలను సీజ్ చేయడంతో పాటు డ్రైవర్లపై చౌటుప్పల్ రాచకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. 43 ఆవులను గోశాలలకు తరలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.

Cattle
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
