AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రీల్స్ పిచ్చి పీక్స్‌కి చేరింది.. ఈ వ్యక్తి ఏం చేశాడో చూస్తే షాకవుతారు.!

హైదరాబాద్ మహా నగరంలో నానాటికీ క్రైం రేటు పెరుగుతోంది. దీనిపై నగర పోలీసు యంత్రాంగం పూర్తి శ్రద్ధ పెట్టినప్పటికీ నేరాల సంఖ్య పెరుగుతూనే ఉందని చెప్పవచ్చు. దీనికి కారణం సరైన విధంగా నేరస్తులకు శిక్ష పడకపోవడమేనని, తమని ఎవరేం చేస్తారనే నిర్లక్ష్యం కూడా..

Viral Video: రీల్స్ పిచ్చి పీక్స్‌కి చేరింది.. ఈ వ్యక్తి ఏం చేశాడో చూస్తే షాకవుతారు.!
Hyderabad
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Jul 01, 2024 | 7:50 PM

Share

హైదరాబాద్ మహా నగరంలో నానాటికీ క్రైం రేటు పెరుగుతోంది. దీనిపై నగర పోలీసు యంత్రాంగం పూర్తి శ్రద్ధ పెట్టినప్పటికీ నేరాల సంఖ్య పెరుగుతూనే ఉందని చెప్పవచ్చు. దీనికి కారణం సరైన విధంగా నేరస్తులకు శిక్ష పడకపోవడమేనని, తమని ఎవరేం చేస్తారనే నిర్లక్ష్యం కూడా కొంతవరకు కారణమని ప్రజలు విమర్శిస్తున్నారు. పోలీసుల చర్యలపై కొంత మంది నేరస్థులు ఏ మాత్రం భయపడడం లేదు. అలాంటి సంఘటనలు రోజూ చూస్తూనే ఉన్నాం.

సోషల్ మీడియా ప్రభావం ఇలాంటి నేరాలపై మరింత ఎక్కువగా ఉంటుందనే విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. కొందరు యువత రీల్స్ మోజులో పడి ఎంతవరకైనా వెళ్తుంటే.. మరి కొందరు సోషల్ మీడియా వేదికగానే వార్నింగులు ఇస్తున్నారు. అలాంటి వీడియో ఒకటి తాజాగా బయటికి వచ్చింది. ఆ వీడియోలో ఓ వ్యక్తి చేతిలో కత్తి పట్టుకుని ఒక సినిమా డైలాగ్‌కి నటించాడు. కత్తి పట్టుకుని బెదిరిస్తున్నట్లుగా ఉన్న ఆ దృశ్యం చూపరులను భయపెట్టేలా ఉంది. ఈ విధమైన వీడియోలు చేసి ప్రత్యర్థులను భయపెట్టిస్తున్నారని కొందరు అంటున్నారు. మరి ఈ వ్యక్తి సినిమా డైలాగ్ కోసం సరదాగా నటించాడా? లేక నిజంగానే ఇలా వీడియో ద్వారా ఎవరినైనా బెదిరింపులకు గురి చేశాడా? అనేది తెలియాల్సి ఉంది.

ఏది ఏమైనా ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కనపడుతున్న తీరు చూస్తుంటే యువత ఆలోచనా విధానం ఎలా చెడు వైపుకు మళ్లుతుందో మనకు స్పష్టంగా అర్థం అవుతోంది. తద్వారా సమాజం ఎటు నుంచి ఎటువైపుకు వెళ్తుందో అర్థం కావటం లేదని ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి చర్యల ద్వారా నగరంలో దారుణాలు, ఘోరాలు జరిగే అవకాశం ఉందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నేరస్తులని ఉక్కుపాదంతో అణచివేసి నేరగాళ్ల ఆగడాలను అరికట్టేలా హైదరాబాద్ పోలీసులు గట్టి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.