Hyderabad Crime News: సూసైడ్ చేసుకుంటానని భర్తను బెదిరిద్దామనుకుంది.. అంతలో నిజంగానే..
ఆత్మహత్య చేసుకుంటానని భర్తకు సెల్ఫీ ఫొటోను పంపినా సదరు పతి దేవుడు స్పందించలేదు. దీంతో మనస్తాపానికి గురైన భార్య నిజంగానే ఫ్యాన్‌కు ఉరేసుకుని బెదిరింపు నిజం చేసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో..
ఆత్మహత్య చేసుకుంటానని భర్తకు సెల్ఫీ ఫొటోను పంపినా సదరు పతి దేవుడు స్పందించలేదు. దీంతో మనస్తాపానికి గురైన భార్య నిజంగానే ఫ్యాన్‌కు ఉరేసుకుని బెదిరింపు నిజం చేసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం (జనవరి 30) ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్‌కు చెందిన రాజేష్ పర్వార్, పూజ (19) దంపతులు. వీరు ఏడాదిన్నర క్రితం నేపాల్ నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చి జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లోని ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో నివసించే శైలుబాబు అనే వ్యాపారి వద్ద పనికి చేరి అక్కడే క్వార్టర్స్‌లో నివసిస్తున్నారు. వ్యాపారి ఇంట్లోనే పూజ వంట పని, రాజన్ సెక్యురిటీగా పని చేసేవాడు. ఐతే గత కొంత కాలంగా భర్త తనపై శ్రద్ధ చూపడంలేదని, మరొక అమ్మాయితో ఫోన్‌లో తరచూ మాట్లాడుతున్నాడని ఇంటి యజమాని వద్ద వాపోయింది.
ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం రాజేష్ గేటు వద్ద విధుల్లో ఉండగా బాత్‌రూమ్‌లోకి వెళ్లిన పూజ మెడకు చున్నీ చుట్టుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సెల్పీ తీసి భర్త రాజేష్‌కు పంపింది. రాజేష్ ఆ ఫొటో చూసుకోలేదు. 2 గంటలు గడిచినా భర్త స్పందించకపోవడంతో మనస్తాపానికిగురైన పూజ బెడ్‌రూమ్ ఫ్యాన్‌కు ఉరేసుకుంది. భార్య ఎంతకూ బయటికి రాకపోయేసరికి అనుమానం వచ్చిన రాజేష్ కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఇంటి యజమాని సహాయంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది. 108 సిబ్బంది వచ్చి ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. జూబ్లీహిల్స్ పోలీసులు రాజన్‌ను అదుపులోకి తీసుకొని ఇద్దరి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఫొటోలో ఉన్న చున్నీ, మృతురాలు ఉరేసుకున్న చున్నీ వేర్వేరుగా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.