Sreerama Chandra: పొలిటీషన్ వల్ల నా ఫ్లైట్ మిస్ అయ్యింది.. మంత్రి కేటీఆర్‌కు కంప్లెయింట్ చేసిన సింగర్ శ్రీరామ్ చంద్ర

రాజకీయ నాయకులు రోడ్డు పై వెళ్లే సమయంలో పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తూ ఉంటారు. ఆ సాయంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అత్యవసరంగా వెళ్లాల్సిన వారు ఈ ట్రాఫిక్ వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు పడుతుంటారు.

Sreerama Chandra: పొలిటీషన్ వల్ల నా ఫ్లైట్ మిస్ అయ్యింది.. మంత్రి కేటీఆర్‌కు కంప్లెయింట్ చేసిన సింగర్ శ్రీరామ్ చంద్ర
Shree Ram Chandra
Follow us

|

Updated on: Jan 31, 2023 | 12:49 PM

టాలీవుడ్ సింగర్ శ్రీరామ్ చంద్రకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఒక పొలిటీషన్ కారణంగా ఆయన తన ఫ్లైట్ మిస్ అయ్యాడు. మాములుగా రాజకీయ నాయకులు రోడ్డు పై వెళ్లే సమయంలో పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తూ ఉంటారు. ఆ సాయంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అత్యవసరంగా వెళ్లాల్సిన వారు ఈ ట్రాఫిక్ వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు పడుతుంటారు. తాజాగా సింగర్ శ్రీరామ్ చంద్రకు కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఒక పొలిటీషన్ కారణంగా తాను గోవా వెళ్లాల్సిన విమానం మిస్ అయ్యిందని సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు.

హైదరాబాద్ నుంచి గోవా వెళ్ళడానికి శ్రీరామ్ చంద్ర బయలు దేరిన సమయంలో.. అటుగా ఓ రాజకీయనాయకుడు వెళ్తుండటంతో ఎయిర్ పోర్ట్‌కు వెళ్లే పివి నరసింహారావు ఫ్లై ఓవర్‌ను తాత్కాలికంగా మూసేసారు. దాంతో అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

అయితే అదే సమయంలో ఎయిర్ పోర్ట్‌కు వెళ్లే శ్రీరామ్ చంద్ర కూడా ఆ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాడట.. ఫ్లై ఓవర్ కాకుండా వేరే దారిలో వెళ్లిన కూడా విమానాన్ని అందుకోలేక పోయారట.. తనతో పాటు మొత్తం 15 మంది విమానాన్ని మిస్ అయ్యామని శ్రీరామ్ చంద్ర తెలిపాడు. ఈ మేరకు ఒక సెల్ఫీ వీడియోను షేర్ చేస్తూ.. మంత్రి కేటీఆర్‌ను, సీఎం కేసీఆర్‌ను ట్యాగ్ చేశాడు శ్రీరామ్ చంద్ర. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.